
అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైటరైడర్స్ 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. నితీష్ రాణా( 53 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 81), సునీల్ నరైన్(32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) సూపర్ బ్యాటింగ్‌కు ఇయాన్ మోర్గాన్(9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 17) మెరుపులు తోడవ్వడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో రబడా, నోర్జ్, స్టోయినిస్ రెండేసి వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. నోర్జ్ బౌలింగ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(9) క్యాచ్ ఔట్ కాగా.. అతని మరుసటి ఓవర్‌లో ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి(13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో కేకేఆర్ పవర్ ప్లే ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 36 రన్స్ చేసింది. అనంతరం దినేశ్ కార్తీక్(3) కూడా తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ రబడా బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరగడంతో కేకేఆర్ 42 రన్స్‌కే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్టస్థితిలో క్రీజులోకి వచ్చిన సునీల్ నరైన్‌తో ఓపెనర్ నితీష్ రాణా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
నరైన్‌ను మిడిలార్డర్‌లో పంపిస్తూ కేకేఆర్ మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఈ ఇద్దరు ఢిల్లీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. నరైన్ వచ్చిరావడంతోనే అశ్విన్ బౌలింగ్‌లో 6,4తో విరుచుకుపడ్డాడు. దేశ్ పాండే వేసిన 10 ఓవర్‌లో నరైన్ రెండు ఫోర్లు కొట్టగా.. రాణా ఓ సిక్స్ కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. అనంతరం ఈ జోడీ మరింత చెలరేగింది. అశ్విన్, స్టోయినిస్‌లే టార్గెట్‌గా భారీ షాట్లతో విరుచుకుపడింది. నోర్జ్ వేసిన 13 ఓవర్‌లో ఫోర్‌తో నితీష్ రాణా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అశ్విన్ వేసిన 15 ఓవర్‌లో ఫోర్, క్విక్ డబుల్‌తో నరైన్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అనంతరం ఈ జోడీ మరింత ధాటిగా ఆడటంతో కేకేఆర్ 16 ఓవర్లలోనే 150 పరుగులు చేసింది. అయితే రబడా వేసిన 17వ ఓవర్‌లో భారీ షాట్ ఆడిన నరైన్.. క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో 4వ వికెట్‌కు నమోదైన 115 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన మోర్గాన్ కూడా ధాటిగా ఆడాడు. స్టోయినిస్ వేసిన ఆఖరి ఓవర్‌లో రాణా రెండు ఫోర్లు కొట్టాడంతో కేకేఆర్ 194 పరుగులు చేసింది. అయితే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో చివరి రెండు బంతులకు రాణా, మోర్గాన్ ఇద్దరూ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరడంతో కేకేఆర్ 200 మార్క్‌ను అందుకోలేకపోయింది.