KKR vs DC: కోల్‌కతాదే బ్యాటింగ్.. ఇరు జట్లలో మార్పులు!

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై గ్రాస్ ఉండటంతో పాటు పేస్ అనుకూలించే అవకాశాల ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. తమ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయని, పృథ్వీషా, డానియల్ సామ్స్ స్థానాల్లో అజింక్యా రహానే, నోర్జ్ వచ్చారని తెలిపాడు. ఇక కోల్‌కతాలో కూడా రెండు మార్పులు జరిగాయి. టామ్ బాంటన్, కుల్దీప్ స్థానాల్లో నాగర్ కోటి, సునీల్ నరైన్ తుది జట్టులోకి వచ్చారు. టాప్ ప్లేస్ లక్ష్యంగా ఢిల్లీ బరిలోకి దిగుతోంది. బెంగళూరు చేతిలో చిత్తయిన కేకేఆర్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకోవాలని భావిస్తోంది.
తుది జట్లు
కోల్‌కతా నైట్‌రైరడర్స్:
శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్, ఫెర్గూసన్, కేఎల్ నాగర్‌కోటి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
ఢిల్లీ క్యాపిటల్స్:
అజింక్యా రహానే, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, మార్కస్ స్టోయినిస్, షిమ్రన్ హెట్‌మైర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడా, తుషార్ దేశ్ పాండే, అశ్లే నోర్జ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications