Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూపర్ మ్యాన్ ధోనీ మ్యాజికల్ క్యాచ్.. ఏజ్ గురించి ఇప్పుడు మాట్లాడండి అంటూ ఫ్యాన్స్ సవాల్!

IPL 2020, KKR vs CSK: Superman’ MS Dhoni pulls off a magical catch to dismiss Shivam Mavi

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. వికెట్ల వెనుకాల తన మ్యాజికల్ కీపింగ్‌తో మైమరిపించాడు. గ్లౌజ్ లేకున్నా ఒంటి చేత్తో అందుకొని ఔరా అనిపించాడు. ఇప్పటికీ తాను వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్‌నే అని చాటి చెప్పాడు. చివరి ఓవర్‌‌లో బర్త్‌డే బాయ్ డ్వేన్ బ్రావో వేసిన వైడ్ స్లోయర్‌ బాల్ కోల్‌కతా టెయిలెండర్ శివమ్ మావి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది.

అయితే బై రూపంలో ఎక్స్‌ట్రా రన్ ఇవ్వవద్దని ముందే భావించిన ధోనీ రనౌట్ కోసం ఒక చేతి గ్లోవ్ తీసి సిద్దంగా ఉన్నాడు. కానీ ఊహించని విధంగా బంతి ఎడ్జ్ తీసుకోవడంతో గ్లౌజ్ లేకున్నా ధోనీ గాల్లోకి ఎగిరి బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి చేజారడంతో మళ్లీ డైవ్ చేసి అందుకున్నాడు. ఇక ధోనీ పట్టిన ఈ సూపర్ క్యాచ్‌కు మైదానంలోని ఆటగాళ్లతో సహా అందరూ బిత్తరపోయారు. ఈ మ్యాచ్‌లో ధోనీ ఏకంగా నాలుగు క్యాచ్‌లు పట్టడంతో పాటు ఓ రనౌట్ చేయడం గమనార్హం.

ఓజా, వేదా ఫిదా..

ఇక ధోనీ స్టన్నింగ్ క్యాచ్‌పై నెటిజన్లు, మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వాటే క్యాచ్ అంటూ కొనియాడుతున్నారు. మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా, మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి మహీ సూపర్ క్యాచ్‌కు ఫిదా అయ్యారు. సలామ్ ఎంఎస్‌డీ అని వేద ట్వీట్ చేయగా.. ‘వాటే క్యాచ్ ధోనీ భాయ్.. ఏజ్ ఒక నెంబర్ మాత్రమేనని నిరూపించావ్'అని ఓజా ప్రశంసించాడు.

హలో హేటర్స్..

ఇక ఈ క్యాచ్‌ పట్ల ధోనీ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హలో హేటర్స్ ఇప్పుడు మాట్లాడండి ధోనీ వయసు గురించి అని సవాల్ విసురుతున్నారు. బ్రావోకు ధోనీ సూపర్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడని, ఇదో అద్భుత క్యాచ్ అని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోనీ గొప్ప వికెట్ కీపర్ అని, వరల్డ్ బెస్ట్ అని కొనియాడుతూ ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

కోల్‌కతా సూపర్ విక్టరీ..

ఇక ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 10 పరుగుల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 167 పరగులకు ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి(51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81) మినహా అంతా విఫలమయ్యారు. బర్త్‌డే బాయ్ బ్రావో మూడు వికెట్లు తీయగా.. సామ్ కరన్, శార్దుల్ ఠాకుర్, కరన్ శర్మ రెండేసి వికెట్లు తీసారు. అనంతరం చెన్నై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులే చేసింది. షేన్ వాట్సన్ (40బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్‌తో 50), అంబటి రాయుడు(27 బంతుల్లో 3 ఫోర్లతో 30) రాణించినా ఫలితం లేకపోయింది.

Story first published: Wednesday, October 7, 2020, 23:56 [IST]
Other articles published on Oct 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+