
తీవ్ర నిరాశ కలిగించింది:
మ్యాచ్ అనంతరం స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ... 'ఈ మ్యాచ్ మాకు ఓ గుణపాఠం నేర్పింది. ఇటువంటి ప్రదర్శన మళ్లీ చేయాలని కోరుకోవడం లేదు. సునీల్ నరైన్‌ను ఇన్నింగ్స్ చివర్లో బౌలింగ్ వేయించడం వల్ల మా బ్యాట్స్‌మెన్‌కు పరుగులు చేయడం కష్టమైంది. షేన్ వాట్సన్, అంబటి రాయుడు మధ్య భాగస్వామ్యం మరో ఐదు ఓవర్ల వరకూ కొనసాగితే.. మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. కోల్‌కతా బౌలర్లు మా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఓటమి మాలో ఎంతో నిరాశ కలిగించింది' అని అన్నాడు.

బ్రావోను సరిగా ఉపయోగించుకోలేకపోయాం:
'జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్, ఆరుగురు బౌలర్లున్నారు. అందువల్లే మరో అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలన్న ఆలోచన చేయలేదు. డ్వేన్ బ్రావో ఎనిమిదో స్థానంలో బ్యాటిగ్ చేస్తాడు. అయితే అతడిని సరిగా ఉపయోగించుకోలేకపోయాం. ఇద్దరు ఆల్‌రౌండర్లు సామ్ కరన్, బ్రావో మంచి ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్, షేన్ వాట్సన్ కూడా బాగా ఆడుతున్నారు. ఇక్కడికే నలుగురు విదేశీ క్రికెటర్లు అయిపోయారు. దీంతో మరో అంతర్జాతీయ బౌలర్‌ను జట్టులో చేర్చుకోలేకపోతున్నాం' అని తెలిపాడు.

ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతాం:
'భారత బౌలర్లపై మేం ఎక్కువగా ఆధారపడుతున్నాం. వాళ్ల బౌలింగ్ ప్రదర్శన బాగుంది. దీపక్ చహర్, పీయూష్ చావ్లా బాగా బౌలింగ్ చేస్తున్నారు. కరణ్ శర్మ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మున్ముందు ముగ్గురు స్పిన్నర్లతో ఆడేందుకు ప్రయత్నిస్తాం' అని చెన్నై కోచ్ స్టీఫెన్ స్టీఫెన్ పేర్కొన్నాడు. 41 బంతుల్లో 67 పరుగులు చేయాల్సిన దశలో వాట్సన్ ఔటవడంతో చెన్నై చిక్కుల్లో పడింది. రసెల్ 18వ ఓవర్ వేసి 3 పరుగులే ఇచ్చి కరన్ (17) వికెట్ పడగొట్టాడు. ఆపై నరైన్ 10 పరుగులు ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్‌లో 26 పరుగులు చేయాల్సి ఉండగా.. జడేజా (21), జాదవ్ (7) 15 పరుగులే చేశారు.

బౌలర్ల శ్రమవృథా అయింది:
చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడాడు... 'మధ్య ఓవర్లలో కోల్‌కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ సమయంలో మేం వికెట్లు కోల్పోకుండా, మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. అలా చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో. ఛేదనలో స్ట్రైక్ రొటేట్ చేయడం ముఖ్యం. ఫైనల్ ఓవర్లలో బౌండరీలు కొట్టాలని అనుకున్నాం. కానీ అలా చేయలేకపోయాం. కరన్ బౌలింగ్ ప్రదర్శన అద్భుతం. బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో బౌలర్ల శ్రమవృథా అయింది' అని చెప్పాడు. .
'మలింగను ఎదుర్కోవడం చాలా కష్టం.. భవిష్యత్తులో అలాంటి బౌలర్‌ను చూడకపోవచ్చు'


Click it and Unblock the Notifications












