For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మలింగను ఎదుర్కోవడం చాలా కష్టం.. భవిష్యత్తులో అలాంటి బౌలర్‌ను చూడకపోవచ్చు'

IPL 2020, KKR vs CSK: Shane Watson names Indian pacer in list of top-5 T20 bowlers of all time

దుబాయ్: క్రికెట్‌ ప్రపంచంలోని గొప్ప ఆల్‌రౌండర్‌లలో షేన్‌ వాట్సన్‌ ఒకడు. ప్రత్యర్థి బౌలర్‌ ఎవరైనా తన బ్యాట్‌తో సమాధానం చెప్పగలడు. ఇక బౌలింగ్‌లోనూ మేటి బ్యాట్స్‌మన్‌ను సైతం వణికించగలడు. అయితే 39 ఏళ్ల వాట్సన్‌ గత రెండు మూడేళ్లుగా బౌలింగ్ చేయడం లేదు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పినా.. పలు టీ20 లీగ్‌లలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌లో) చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరుపున కీలక ఆటగాడిగా ఉన్నాడు. తన కెరీర్‌లో ఎంతో మంది మేటి బౌలర్ల్‌ను ఎదుర్కున్న వాట్సన్‌.. తనను బాగా ఇబ్బంది పెట్టిన టాప్-5 బౌలర్ల పేర్లు చెప్పాడు.

షేన్‌ వాట్సన్‌ తన టాప్‌-5 టీ20 బౌలర్ల జాబితాలో లసిత్‌ మలింగ​ మొదటి స్థానంలో ఉన్నాడు. టీ20లో మలింగ అత్యుత్తమ బౌలర్‌ అని వాట్సన్‌ కొనియాడాడు. మలింగ వేసే యార్కర్స్‌ ఏ బౌలర్‌ వేయలేడన్నాడు. మలింగను ఎదుర్కోవడం చాలా కష్టమని, భవిష్యత్తులో కూడా అలాంటి బౌలర్‌ను చూడకపోవచ్చని వాట్సన్‌ అభిప్రాయపడ్డాడు.

రెండో బౌలర్‌ షాహిద్‌ అఫ్రిది పేరు చెప్పాడు షేన్‌ వాట్సన్‌. షాహిద్‌ ఒక విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ అయినా.. టీ20లో అతడు మంచి బౌలర్‌ అని పేర్కొన్నాడు. వికెట్లు తీయడకమే కాకుండా పరుగులు ఇవ్వకుండా కట్టడిచేయగల సత్తా ఉన్న బౌలర్‌ అని ప్రశంసించాడు. ప్రతి జట్టులో అలాంటి ఒక బౌలర్‌ ఉండాలని ప్రతిఒక్కరు కోరు​కుంటారని తెలిపాడు.

IPL 2020, KKR vs CSK: Shane Watson names Indian pacer in list of top-5 T20 bowlers of all time

ఇక మూడో స్థానంలో షేన్‌ వాట్సన్‌ టీమిండియా పేస్ గుర్రం జస్ప్రిత్‌ బుమ్రా పేరు చెప్పాడు. ప్రస్తుత కాలంలో బుమ్రా అత్యుత్తమ బౌలర్‌ అని, అద్భుతమైన యార్కర్స్‌ వేస్తాడని పేర్కొన్నాడు. బంతి వేగంతో పాటు స్వింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్న బౌలరని, అతడి బౌలింగ్‌లో ఆడడం ఛాలెంజింగ్‌గా ఉంటుందని తెలిపాడు. నాలుగు, ఐదు స్థానాల్లో వెస్టిండీస్‌ ఆటగాళ్లు డ్వైన్‌ బ్రావో, సునీల్ నరైన్‌ పేర్లను తెలిపాడు. ఇద్దరూ బాగా బౌలింగ్ చేస్తారని వాట్సన్‌ కితాబిచ్చాడు.

గత మూడు మ్యాచులలో పరుగులు చేయడంలో బాగా ఇబ్బందిపడ్డ షేన్‌ వాట్సన్‌.. పంజాబ్‌ మ్యాచ్‌లో ఎట్టకేలకు ఫామ్‌ అందుకున్నాడు. అద్భుత హాఫ్ సెంచరీ (53 బంతుల్లో 83 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్సర్లు)తో ఆకట్టుకున్నాడు. వాట్సన్‌ సెంచరీ చేసేలా కనిపించినా.. డుప్లెసిస్‌ బౌండరీలు బాదడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. ఫామ్‌ అందుకున్న వాట్సన్‌.. ఈరోజు ఎలా ఆడుతాడో చూడాలి. ఐపీఎల్ 2020లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది.

Story first published: Wednesday, October 7, 2020, 15:18 [IST]
Other articles published on Oct 7, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+