KKR vs CSK: చేతులెత్తేసిన చెన్నై.. కోల్‌కతా అద్భుత విజయం!

అబుదాబి: రాహుల్ త్రిపాఠి (51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81) సూపర్ బ్యాటింగ్‌కు అండగా బౌలర్లు చెలరేగడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో విజయాన్నందుకుంది. బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా 10 పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలుపొందింది. బౌలింగ్‌లో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. బ్యాటింగ్‌లో ఆ జోరును కొనసాగించలేకపోయింది. షేన్ వాట్సన్(40బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్‌తో 50), అంబటి రాయుడు(27 బంతుల్లో 3 ఫోర్లతో 30) అందించిన సహకారాన్ని ఇతర బ్యాట్స్‌మెన్ కోనసాగించలేకపోయారు.
ఈ ఇద్దరి జోరు ముందు ఒకానొక దశలో చెన్నై విజయం సులువు అనిపించింది. కానీ కోల్‌కతా బౌలర్లు అద్భుతంగా కమ్ బ్యాక్ చేశారు. పరుగులు చేయకుండా కట్టడి చేస్తూ ఒత్తిడిని పెంచి వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులకే పరిమితమైంది. ఇక కోల్‌కతా బౌలర్లలో శివమ్ మావి, వరుణ్, నాగర్ కోటి, నరైన్, రస్సెల్ తలో వికెట్ తీశారు.

విఫలమైన ఫాఫ్
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు మంచి స్టార్ట్ లభించలేదు. శివం మావి వేసిన నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్(17) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇక క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడుతో వాట్సన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. శివమ్ మావి వేసిన 6వ ఓవర్‌లో వాట్సన్ 6, 4తో వరుస బౌండరీలు కొట్టడంతో సీఎస్‌కే పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. అనంతరం ఓవర్‌కో బౌండరీ కొట్టిన ఈ జోడీ స్కోర్ బోర్డ్‌ను పరుగెత్తించింది. కానీ 11వ ఓవర్‌ను కమిన్స్..12వ ఓవర్‌లో నరైన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 9 పరుగులే వచ్చాయి. దాంతో ఒత్తిడికి లోనైనా అంబటి రాయుడు నాగర్ కోటి వేసిన 12వ ఓవర్ తొలి బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో శుభ్‌మన్ గిల్‌కు చిక్కాడు.

వాట్సన్ హాఫ్ సెంచరీ..
ఈ ఓవర్ చివరి బంతిని సింగిల్ తీసిన వాట్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ లీగ్‌లో అతనికిది వరుసగా రెండో హాఫ్ సెంచరీ. అయితే నరైన్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం దక్కలేదు. దాంతో చెన్నై పరుగుల వేగం తగ్గింది. ఇక నరైన్ వేసిన 16వ ఓవర్‌లో సామ్ కరన్ 6, 4తో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు కొట్టడంతో 14 రన్స్ వచ్చాయి. ఇక వరుణ్ చక్రవర్తి వేసిన 17వ ఓవర్‌లో ఫోర్ కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన ధోనీ.. ఆ మరుసటి బంతికే క్లీన్ బౌల్ట్ అయి నిరాశ పరిచాడు.

ధాటిగా ఆడని జడేజా, జాదవ్
చివరి 18 బంతుల్లో చెన్నై విజయానికి 39 పరుగులు కావాల్సి ఉండగా.. రస్సెల్ వేసిన తొలి బంతికే కరన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం రస్సెల్ కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో మూడు పరుగులే వచ్చాయి. దాంతో చివరి 12 బంతుల్లో చెన్నై విజయానికి 36 పరుగులు అవసరమయ్యాయి. జాదవ్ ఓ ఫోర్ కొట్టి సింగిల్ తీసియ్యగా.. జడేజా కూడా ఫోర్ కొట్టడంతో 10 పరుగులే వచ్చాయి. ఆఖరి ఓవర్ రస్సెల్ వేయగా.. జడేజా సిక్స్, ఫోర్ కొట్టినా ఫలితం లేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications