For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారెవ్వా వాటే క్యాచ్.. ఈ సారి జడేజా, ఫాఫ్ డబుల్ ధమాకా! (వీడియో)

IPL 2020, KKR vs CSK: Ravindra Jadejas stunning catch sends Sunil Narine back
IPL 2020, KKR vs CSK : Ravindra Jadeja's Stunning Catch Sends Sunil Narine Back || Oneindia Telugu

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన మార్క్ ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. బౌండరీ లైన్ వద్ద సూపర్ డైవ్‌తో బంతిని అద్భుతంగా అందుకొని సహచర ఆటగాడు ఫాఫ్ డూప్లెసిస్‌కు అందించాడు. ఈ ఇద్దరి ఫీల్డింగ్ విన్యాసానికి మైదానంలోని ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. వాటే క్యాచ్ అంటూ కొనియాడారు. ఫాఫ్,జడేజా డబుల్ ధమాకా ఫీల్డింగ్‌తో సునీల్ నరైన్(9 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 17)నిరాశగా పెవిలియన్ చేరాడు.

కరన్ శర్మ వేసిన 11 ఓవర్ చివరి బంతిని సునీల్ నరైన్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడగా.. జడేజా బౌండరీ లైన్ వద్ద పరుగెత్తుతూ డైవ్ చేసి మరి అందుకున్నాడు. అయితే బౌండరీ లైన్ సమీపిస్తున్న క్రమంలో పక్కనే ఉన్న డుప్లెసిస్‌కు చాకచక్యంగా అందించాడు. ఈ సూపర్ ఫీల్డింగ్‌కు ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఫాఫ్ డూప్లెసిస్ ఈ సీజన్‌లో ఇలాంటి క్యాచ్‌లను అందుకొని ఔరా అనిపించాడు. ఆ తర్వాత ధోనీ కూడా మైమరిపించే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ప్రతీ మ్యాచ్‌లో ఇలాంటి సూపర్ క్యాచ్‌లు ఉంటుండంతో ప్రేక్షకులు పండుగ చేసుకుంటున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 10 పరుగుల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 167 పరగులకు ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి(51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81) మినహా అంతా విఫలమయ్యారు. బర్త్‌డే బాయ్ బ్రావో మూడు వికెట్లు తీయగా.. సామ్ కరన్, శార్దుల్ ఠాకుర్, కరన్ శర్మ రెండేసి వికెట్లు తీసారు. అనంతరం చెన్నై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులే చేసింది. షేన్ వాట్సన్ (40బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్‌తో 50), అంబటి రాయుడు(27 బంతుల్లో 3 ఫోర్లతో 30) రాణించినా ఫలితం లేకపోయింది. వీరి బ్యాటింగ్ జోరుకు ఒకానొక దశలో చెన్నై విజయం ఖాయమనిపించింది. కానీ కోల్‌కతా సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకుంది.

Story first published: Thursday, October 8, 2020, 0:00 [IST]
Other articles published on Oct 8, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+