Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs CSK: కోల్‌కతాదే బ్యాటింగ్.. చెన్నై జట్టులో మార్పు!

Kolkata Knight Riders vs Chennai Super Kings

అబుదాబి: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నామని కెప్టెన్ దినేశ్ కార్తీక్ చెప్పాడు. ఇక తాము టాస్ గెలిచినా ఫీల్డింగే తీసుకునేవాళ్లమని ధోనీ తెలిపాడు. జట్టులో ఒక మార్పు చేశామని, పియూష్ చావ్లా ప్లేస్‌లో కరణ్ శర్మ జట్టులో వచ్చాడన్నాడు. అయితే పియూష్ చావ్లా కేకేఆర్ మాజీ ప్లేయర్ కావడంతోనే ధోనీ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.

వరుస పరాజయాలతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒత్తిడిలో ఉండగా.. హ్యాట్రిక్ ఓటముల తర్వాత కింగ్స్ పంజాబ్‌ను చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఉత్సాహంగా బరిలోకి దిగుతుంది. అయితే ఇక్కడ మ్యాచ్ కంటే కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌పైనే అందరి దృష్టి నెలకొంది. స్టార్ ఆటగాళ్లున్నా జట్టు ఓడిపోతుండటంతో డీకే కెప్టెన్సీ వైఫల్యం చర్చకు దారి తీస్తుంది.

ఈ మ్యాచ్ అతని కెప్టెన్సీకి అగ్ని పరీక్షగా మారింది. వ్యక్తిగతంగాను అతను చెలరేగాల్సి ఉంది. ఇక ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 20 సార్లు తలపడగా 13-7తో చెన్నై లీడ్‌లో ఉంది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని సీఎస్‌కే భావిస్తుండగా.. లెక్క సరిచేయాలనే పట్టుదలతో కేకేఆర్ ఉంది. గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెన్నైనే విజయం వరించింది.

తుది జట్లు:

కోల్‌కతా నైట్‌రైడర్స్:
సునీల్ నరైన్, శుబ్‌మన్ గిల్, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్ (కెప్టెన్, కీపర్), ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, రాహుల్ త్రిపాఠి, పాట్ కమిన్స్, కమలేష్ నాగర్‌కోటి, శివం మావి, వరుణ్ చక్రవర్తి

చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, సామ్ కరన్, శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్, కరన్ శర్మ

Story first published: Wednesday, October 7, 2020, 19:10 [IST]
Other articles published on Oct 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+