Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs CSK: బర్త్‌డే బాయ్ బ్రావో తీన్మార్.. కోల్‌కతా ఆలౌట్

 Kolkata bowled out for 167 despite Tripathi 81

అబుదాబి: బర్త్‌డే బాయ్ డ్వేన్ బ్రావో(3/37)తో పాటు ఇతర చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు చెలరేగడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 167 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి(51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81) మినహా అంతా విఫలమయ్యారు. 10 ఓవర్లకు మంచి రన్‌రేట్‌తో ఉన్న కేకేఆర్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ చివరి పది ఓవర్లలో వరుసగా వికెట్లు చేజార్చుకొని సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. బ్రావోకు తోడుగా సామ్ కరన్, శార్దుల్ ఠాకుర్, కరన్ శర్మ రెండేసి వికెట్లు తీసారు.

శుభారంభం దక్కలేదు..
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ శుభమన్ గిల్(11) తీవ్రంగా నిరాశపరిచాడు. శార్దుల్ ఠాకుర్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ రాణాతో మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అతనే ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకుంటూ బౌండరీలు బాదాడు.

అయితే నితీష్ రాణా(9) కరన్ శర్మ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అనంతరం సునీల్ నరైన్ క్రీజులోకి రాగా.. బ్రావో బౌలింగ్‌లో ఫోర్ కొట్టి రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్‌లో వరుసగా 6, 4 కొట్టిన నరైనా టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు.కానీ కరన్ శర్మ వేసిన ఆ మరసటి ఓవర్‌లోనే జడేజా-ఫాఫ్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు.

నిరాశపర్చిన రస్సెల్, మోర్గాన్..
అనంతరం క్రీజులోకి వచ్చిన ఇయాన్ మోర్గాన్(7) కూడా ఆకట్టుకోలేకపోయాడు. టామ్ కరన్ వేసిన బౌలింగ్‌లో కీపర్‌ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో కేకేఆర్ పరుగుల వేగం తగ్గింది. ఈ క్రమంలో దీపక్ చాహర్ వేసిన 15వ ఓవర్‌లో రాహుల్ త్రిపాఠి 4, 6తో‌తో రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ ఆ మరుసటి ఓవర్‌లోనే విధ్వంసకర వీరుడు ఆండ్రూ రస్సెల్(2) ఔటయ్యాడు.

శార్దుల్ ఠాకుర్ వేసిన బౌన్సర్‌ను రస్సెల్ తప్పుగా అంచనా వేయడంతో బంతి బ్యాట్‌ను తాకుతూ కీపర్ ధోనీ చేతిలో పడింది. బ్రావో వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే త్రిపాఠి వాట్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో కేకేఆర్ వికెట్ల పతనం మొదలైంది.

మాయ చేసిన బర్త్‌డే బాయ్
ఠాకుర్ వేసిన 18వ ఓవర్‌లో కమిన్స్ 6,4తో 14 పరుగులు పిండుకున్నా.. కరన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన కార్తీక్ ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. ఇక బ్రావో వేసిన చివరి ఓవర్‌లో నాగర్ కోటి(0), శివమావి(0) ఔటవ్వగా.. ఆఖరి బంతికి వరుణ్ చక్రవర్తి రనౌటవ్వడంతో కేకేఆర్ ఆలౌటైంది. కమిన్స్(17 నాటౌట్) ఒక్కడే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో మిగిలిపోయాడు.

Story first published: Wednesday, October 7, 2020, 22:09 [IST]
Other articles published on Oct 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+