For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అయ్యబాబోయ్.. ఇరవయ్యో సారి ఆ టెస్ట్ చేయించుకున్న ప్రీతి జింటా (వీడియో)

IPL 2020: Kings XI Punjab Co Owner Preity Zinta has gone Covid-19 test for 20 times

దుబాయ్: భారత్‌లో కరోనా వైరస్ అధికంగా ఉండడంతో మార్చిలో ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఆరు నెలలు లేటుగా యూఏఈలో జరుగుతున్న విషయం తెలిసిందే. టోర్నీలో ఎవరూ కూడా కరోనా వైరస్ బారిన పడకుండా బీసీసీఐ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రేక్షకులెవరూ లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. మరోవైపు మ్యాచ్‌లు ఆరంభానికి ముందే బయో బబుల్‌ వాతావరణం సృష్టించి ఆటగాళ్లు, ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, కోచింగ్ సిబ్బంది, సహాయ సిబ్బందిని అందులో ఉంచింది.

ఇరవయ్యో సారి టెస్ట్

ఇరవయ్యో సారి టెస్ట్

బయో బబుల్‌లో ఉన్న అందరికి ప్రతి నాలుగు రోజులకు ఒకసారి కరోనా వైరస్ టెస్ట్ చేస్తారు. ఈ క్రమంలో ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళ్లిన కింగ్స్‌ లెవ‌న్ పంజాబ్‌ సహ యజమాని ప్రీతి జింటా కూడా తాజాగా టెస్ట్ చేయించుకున్నారు. తన దగ్గర్నుంచి కరోనా టెస్టు కోసం శాంపిళ్లను సేకరిస్తోన్న ఓ వీడియోను ప్రీతి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇప్పటి వరకూ తాను 20సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నానని వీడియోలో తెలిపారు. ఇలా టెస్టులు చేయించుకుని తాను కోవిడ్ టెస్ట్ క్వీన్ అయిపోయానని ప్రీతి చమత్కరించారు. అంతేకాదు కరోనా టెస్ట్ చేసిన ఒకామెను ప్రశంసించారు. ఆమె చాలా బెస్ట్ అని పొగిడారు.

పంజాబ్ యాజమాన్యంకు థ్యాంక్స్

పంజాబ్ యాజమాన్యంకు థ్యాంక్స్

కరోనా టెస్ట్ చేయించుకుంటున్న వీడియోను ప్రీతి జింటా తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'చాలా మంది బయో బబుల్ అంటే ఏంటని నన్ను అడుగుతున్నారు. బయో బబుల్ అంటే.. ఆరు రోజుల క్వారంటైన్, నాలుగు రోజులకోసారి కోవిడ్ టెస్టులు చేయించుకోవడం. మనకు కేటాయించిన గదికే పరిమితం కావడం. జట్టుకు కేటాయించిన రెస్టారెంట్, జిమ్, స్టేడియంను మాత్రమే ఉపయోగించడం. బీసీసీఐ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యంకు చాలా థ్యాంక్స్. మమ్మల్ని జాగ్రత్తగా ఉంచడం కోసం, ఐపీఎల్ ముందుకు కొనసాగడం కోసం వీరేంతో శ్రమిస్తున్నారు' అని ప్రీతి కాప్షన్ పెట్టారు.

గెలుపు సంబరాలు

గెలుపు సంబరాలు

తాజాగా సూపర్‌ ఓవర్‌లో పంజాబ్‌ గెలిచిన తర్వాత గెలుపు సంబరాల్ని వీడియో రూపంలో పంచుకున్నారు ప్రీతి జింటా. 'మనం ఏమీ మాట్లాడాలో తెలియనప్పుడు చేసే పనులే మాట్లాడతాయి. రెండు సూపర్‌ ఓవర్లు. ఓ మై గాడ్‌. నేను ఇంకా షేక్‌ అవుతూనే ఉన్నాను. ఇది కింగ్స్‌ పంజాబ్‌ బాయ్స్‌ విజయం. వాటే గేమ్‌. వాటే నైట్‌.. వాటే ఫీలింగ్‌. టీమ్‌ ఎఫర్ట్‌కు థాంక్యూ. ఇక్కడ టీమ్‌ వర్క్‌ అత్యుత్తమం' అని ప్రీతి ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

బయో బబుల్ అంటే

బయో బబుల్ అంటే

బయో బబుల్ అంటే.. పూర్తిగా శానిటైజ్ చేసిన ప్రాంతం. క్వారంటైన్ పూర్తి చేసుకొని, కరోనా టెస్టులో నెగటివ్ అని తేలితేనే బయో బబుల్‌లోకి ప్రవేశం ఉంటుంది. బయటి వాళ్లతో కాంటాక్ట్ అయ్యే వీలుండదు. ఫలితంగా కోవిడ్ బారిన పడే ముప్పు తగ్గుతుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆటగాళ్లు, సిబ్బంది ప్రయాణించినా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆటగాళ్ల మొదలుకుని హోటల్ అండ్ గ్రౌండ్ సిబ్బందికి సైతం కరోనా టెస్టులు చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమించి బయటకు వెళ్తే.. క్వారంటైన్ పూర్తిచేయాల్సి ఉంటుంది.

CSK: ధోనీ ఆ ఒక మార్పు చేస్తే చాలు.. ఫామ్ అందుకుంటాడు: అగర్కార్

Story first published: Wednesday, October 21, 2020, 17:38 [IST]
Other articles published on Oct 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+