For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: టాప్‌-20 ఫాస్టెస్ట్‌ బాల్స్‌.. ఒక్కడే 15 వేశాడుగా!!

IPL 2020: Jofra Archer has bowled Most Fastest Balls So Far, Jasprit Bumrah bowled Most Dot Balls

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 రసవత్తరంగా సాగుతోంది. ప్రతి జట్టు ఆధిపత్యం చెలాయించాలని చూస్తుండంతో టోర్నీ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. బ్యాట్స్‌మన్‌ బాదే బౌండరీలు, బౌలర్ తీసే వికెట్లు, ఫీల్డర్ చేసే విన్యాసాలు క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందిస్తోంది. బౌలర్లు పర్పుల్ క్యాప్ కోసం పోటీపడుతున్నారు. కాగిసో రబాడ 12 వికెట్లు తీసి అగ్ర స్థానంలో ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా (11), ట్రెంట్ బౌల్ట్ (10), జేమ్స్ ప్యాటిన్సన్ (9), యుజువేంద్ర చహల్ (8) టాప్-5లో ఉన్నారు. ఐదు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు మాత్రమే తీసిన రాజస్తాన్‌ రాయల్స్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్.. వేగంలో మాత్రం దడపుట్టిస్తున్నాడు.

20లో ఒక్కడే 15

20లో ఒక్కడే 15

ఐపీఎల్ 2020లో ఇప్పటివరకూ టాప్‌-20 ఫాస్టెస్ట్‌ డెలివరీల లిస్టులో జోఫ్రా ఆర్చర్‌ వేసినవే 15 ఉన్నాయి. దీన్ని బట్టే అతని వేగం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో 150కి.మీ పైగా వేగంతో వేసిన బంతులు 11 ఉన్నాయి. 149 కి.మీ వేగంగా కంటే ఎక్కువ వేసినవి మరో 4 బంతులు ఉ‍న్నాయి. ఓవరాల్‌గా చూస్తే ఫాస్టెస్ట్‌ బంతుల్ని ఎక్కువ వేసిన బౌలర్లలో ఆర్చర్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో 150 కి.మీ వేగాన్ని దాటిన బౌలర్లలో‌ ఆర్చర్‌, దక్షిణాఫ్రికా బౌలర్ అన్రిచ్ నోర్జే, ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ మాత్రమే ఉన్నారు.

సైనీకి చోటు

సైనీకి చోటు

ఐపీఎల్ 2020లో ఇప్పటివరకూ టాప్‌-20 ఫాస్టెస్ట్‌ డెలివరీల లిస్టులో అన్రిచ్‌ నోర్జే, ప్యాట్ కమిన్స్, నవదీప్‌ సైనీకి మాత్రమే చోటు దక్కింది. కమిన్స్ 151.70కి.మీ వేగంతో ఓ బంతిని వేశాడు. నోర్జే 151.12, సైనీ 149.34 కి.మీ వేగంతో బంతులు సంధించి టాప్‌-20 ఫాస్టెస్ట్‌ డెలివరీల లిస్టులో చోటు దక్కించుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా (147.82), కాగిసో రబాడ (147.60), హజిల్‌వుడ్ (147.32), రసెల్ (146.25)లు మాత్రమే టాప్‌-100లో ఉన్నారు.

అత్యధిక డాట్ బాల్స్ వేసింది బుమ్రా

అత్యధిక డాట్ బాల్స్ వేసింది బుమ్రా

ఐపీఎల్ 2020లో అత్యధిక డాట్ బాల్స్ వేసింది టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా. అతడు ఆరు మ్యాచుల్లో 69 డాట్ బాల్స్ వేసి అగ్ర స్థానంలో ఉన్నాడు. జోఫ్రా ఆర్చర్ ఐదు మ్యాచుల్లో 62 డాట్ బాల్స్ వేసి రెండో స్థానంలో ఉన్నాడు. ట్రెంట్ బౌల్ట్ (61), జేమ్స్ ప్యాటిన్సన్ (56), అన్రిచ్‌ నోర్జే (53) టాప్-5లో ఉన్నారు.

ఇంగ్లండ్‌ జట్టులోకి నేరుగా ఎంట్రీ

ఇంగ్లండ్‌ జట్టులోకి నేరుగా ఎంట్రీ

రెండేళ్ల క్రితం ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ముంబై ఇండియన్ప్‌తో మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు సాధించి సత్తా చాటాడు.తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఉత్తమ గణాంకాల్ని నమోదు చేశాడు. దీంతో ఇంగ్లండ్‌ జట్టులోకి నేరుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ జట్టుకు కీలకంగా మారిన ఈ పేసర్‌.. ఇంగ్లండ్ తొలిసారి వరల్డ్‌కప్‌ గెలవడంలో కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌తో పాటు వైవిధ్యమైన బంతులు, యార్కర్లతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు ఆర్చర్.

IPL 2020లోకి లేటుగా వచ్చాడు.. అప్పుడే దూరమయ్యాడు.. పాపం అలీఖాన్‌!!

Story first published: Wednesday, October 7, 2020, 13:18 [IST]
Other articles published on Oct 7, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+