బుర్రను ఉపయోగిస్తే.. వయసుతో సంబంధం లేదు!! ధోనీకి మియాందాద్ సలహాలు!

కరాచీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్ 2020 కంటే ముందు మహీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో ఈ టీ20 లీగ్‌లో ఎలా ఆడుతాడని అందరూ ఎదురుచూశారు. అయితే టీ20 మెగా క్రికెట్ లీగ్‌లో ధోనీ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. మరోవైపు మునుపటిలా సారథ్యంలో పదును లేదు. దీంతో ఇప్పటివరకు చెన్నై ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలే సాధించి పాయింట్ల పట్టికలో వెనుకపడింది. ఈ క్రమంలోనే మహీ వైఫల్యాలకు కారణాలను విశ్లేషించాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్.

వయసు ప్రభావం ఉంటుంది:
తాజాగా జావెద్ మియాందాద్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ ఫిట్‌గా లేడు, దాంతో అతడు షాట్ల టైమింగ్, సమన్వయ లోపంతో ఇబ్బందులు పడుతున్నాడు. మహీ స్వతహాగా తన పరిస్థితిని సమీక్షించుకోవాలి. చాలా కాలం విశ్రాంతి తర్వాత ధోనీ ఈ టీ20 లీగ్ ఆడుతున్నాడు. అందుకే సరైన విధంగా ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ధోనీ లాంటి సీనియర్ ఆటగాడికి వయసు ప్రభావం ఉంటుంది. దాంతో తనకు తానే పూర్తి ఫిట్‌గా ఉండేందుకు కృషిచేయాలి' అని సూచించాడు.

మ్యాచ్ ఫిట్‌నెస్ కోల్పోయాడు:
'ఎంఎస్ ధోనీ శారీరకంగా దృఢంగానే ఉన్నా.. మ్యాచ్ ఫిట్‌నెస్ కోల్పోయాడు. ఇప్పటివరకు ధోనీ ఆడిన షాట్లలో శరీర కదలికలు సరిగ్గా లేవని నా అభిప్రాయం. అదే అతడి టైమింగ్ సమస్యకు కారణం. అయితే మహీకి టెక్నికల్‌గా ఎలాంటి ఇబ్బందులూ లేవు. మహీ ప్రస్తుతం చేస్తున్న వ్యాయామ సాధనాలను మరింత ఎక్కువగా చేయాలి. అలాగే నెట్స్‌లో బ్యాటింగ్‌కు కూడా కాస్త ఎక్కువ సమయం కేటాయించాలి. ఒకేసారి పెంచకుండా నెమ్మదిగా, లేదా సెషన్ల వారీగా మహీ తన ప్రాక్టీస్ పెంచుకోవాలి. ధోనీకి ఈ విషయాలు అన్ని తెలుసు. ఈ పాటికే తన ఫిట్‌నెస్ లెవెల్స్‌ను మెరుగుపర్చుకోడానికి ప్రయత్నిస్తుండవచ్చు' అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ అన్నాడు.

బుర్రను ఉపయోగిస్తే వయస్సుతో సంబంధం లేదు:
చివరగా అనుభవంతోనే అత్యుత్తమ క్రికెటర్‌గా తయారవుతారని, ఈ క్రమంలో ఫిట్‌నెస్ లెవెల్స్ తగ్గితే రిటైర్మెంట్‌కు దగ్గర పడతారని జావెద్ మియాందాద్ పేర్కొన్నాడు. దీంతో సీనియర్ బ్యాట్స్‌మెన్‌కు టెస్టు క్రికెటే సరిగ్గా సరిపోతుందన్నాడు. తాను తెలివితో ఆడానని, బుర్రను ఉపయోగిస్తే వయస్సుతో సంబంధం లేకుండా ఆడవచ్చన్నాడు. మహీ అలాంటి ప్లేయర్ కాదని, అయితే తెలివితో ఆడితే మరింత కాలం ఆడొచ్చని పాక్ మాజీ క్రికెటర్ వివరించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో జావెద్ మియాందాద్ 124 టెస్టుల్లో, 233 వన్డే మ్యాచ్‌ల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
CSK vs RR: చెన్నైని వణికించిన రాజస్థాన్ బౌలర్లు.. స్వల్ప స్కోరుకే పరిమితమైన ధోనీసేన!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications