
భార్యను వదిలేసి వచ్చేశా
మ్యాచ్ అనంతరం జేసన్ హోల్డర్ మాట్లాడుతూ... సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నుంచి పిలుపు అందడంతో వెకేషన్ మధ్యలోనే తన భార్యను వదిలేసి వచ్చేశానని తెలిపాడు. 'నా భార్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లా. అదే సమయంలో సన్‌రైజర్స్ యాజమాన్యం నుంచి పిలుపు వచ్చింది. అందుకు చాలా సంతోషపడ్డా. వెకేషన్ మధ్యలోనే నా భార్యను వదిలేసి రావడం కష్టంగానే అనిపించింది. కష్టంగా ఉంది కూడా. అయితే క్రికెట్ ఆడటం కోసం తప్పలేదు' అని జేసన్ హోల్డర్ తెలిపాడు.

ఐపీఎల్ ఆడడం కోసం ఎదురుచూశా
'సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మళ్లీ ఐపీఎల్ ఆడడం కోసం నాకు అవకాశం ఇచ్చింది. ఇందుకు వారికి కృతజ్ఞతలు. ఐపీఎల్‌లోకి తిరిగి అడుగుపెట్టే అవకాశం కోసం ఎదురు చూశా. చివరికి నాకు ఇలా అదృష్టం వచ్చింది. తొలి మ్యాచులోనే మంచి ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది' అని వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ చెప్పాడు. హోల్డర్ చివరిసారిగా 2016లో ఐపీఎల్ ఆడాడు. గతంలో మూడు సీజన్లలో ఆడాడు. అప్పుడు ఒక మ్యాచ్‌లో రెండు కంటే ఎక్కువ వికెట్లు తీయలేదు కానీ ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు పడగొట్టాడు.

విలియమ్సన్ గాయం కారణంగా
గాయపడిన మిచెల్ మార్ష్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చిన జేసన్ హోల్డర్.. నిన్నటి వరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు. తుది జట్టులో నాలుగు విదేశీ ఆటగాళ్ల నిబంధన కారణంగా అతనికి అవకాశం రాలేదు. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ తుది జట్టులో ఆడుతున్నారు. అయితే విలియమ్సన్ గాయపడడంతో.. ఆ స్థానంలో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హోల్డర్ ఆడాడు. ఆడడమే కాదు ఔరా అనిపించాడు. సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, రియాన్ పరాగ్‌లను ఔట్ చేశాడు.

బీఎల్‌ఎమ్‌కు ఇక్కడ సపోర్ట్ లేదు
ఈ మ్యాచుకు ముందు విండీస్ జట్టు తరఫున ప్రతిష్టాత్మక పీటర్ స్మిత్ అవార్డు స్వీకరణ సందర్భంగా హోల్డర్ వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడాడు. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (బీఎల్‌ఎమ్) ఉద్యమం జరుగుతుంటే ప్రస్తుత ఐపీఎల్‌లో దాని గురించి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం తీవ్ర నిరాశను కల్గించిందన్నాడు. ఉద్యమంకు క్రికెట్ వెస్టిండీస్ ఎంతో మద్దతుగా నిలుస్తుంటే కొన్ని చోట్ల దాని ఊసే లేకపోవడం బాధకల్గిస్తుందన్నాడు. ఐపీఎల్‌లో బీఎల్‌ఎమ్ మాటే వినిపించడం లేదని, అసలు దాన్ని గుర్తించకపోవడం చాలా నిరాశ కల్గిస్తుందని హోల్డర్ పేర్కొన్నాడు.
చెన్నైకి ప్లేఆఫ్స్ అవకాశాలు లేవు.. ఇక ఇంటికి పయనమవ్వాల్సిందే: మాజీ క్రికెటర్


Click it and Unblock the Notifications












