IPL 2020: హర్భజన్ సింగ్ స్థానంలో మనోజ్ తివారీకి అవకాశం దక్కెనా..?

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ప్రారంభానికి ఇంకా 15 రోజులే ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. తొలుత ఆ జట్టుకు కరోనా సెగ తగలడం.. ఆ తర్వాత స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తప్పుకోవడం.. తాజాగా హర్భజన్ సింగ్ కూడా వైదొలగడంతో సీఎస్‌కే ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ విపత్కర కాలంలో ఫ్యామిలీతో ఉండటమే ముఖ్యమని భావించి ఈ సీజన్‌లో పాల్గొనడం లేదని భజ్జీ వెల్లడించాడు.
అయితే హర్భజన్ సింగ్ తప్పుకోవడంతో చెన్నై జట్టుకు ఆఫ్ స్పిన్నర్ల కొరత ఏర్పడనుంది. ప్రస్తుత జట్టులో కేదార్ జాదవ్ ఒక్కడే ఆఫ్ స్పిన్నర్. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ సీనియర్ స్పోర్ట్స్ రిపోర్టర్ ట్వీట్ చేశాడు.'హర్భజన్ వైదొలగడంతో ఆ స్థాయి ఆఫ్ స్పిన్నర్ సీఎస్‌కేలో మరెవరూ లేరు. కేదార్ జాదవ్ ఒక్కడే ఉన్నాడు. మిగతావారంతా లెఫ్టార్మ్ స్పిన్నర్లే.'అని పేర్కొన్నాడు. అయితే ఈ ట్వీట్‌పై స్పందిస్తూ మనోజ్ తివారీ.. బెంగాల్, ఢిల్లీ మధ్య జరిగిన ఓ రంజీ మ్యాచ్‌లో తాను చేసిన బౌలింగ్ వీడియోను పంచుకున్నాడు. ఇది పనిచేస్తుందా? అని ప్రశ్నించాడు. దీంతో మనోజ్ తివారీ.. సీఎస్‌కే జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడా? అనే ప్రచారం ఊపందుకుంది.
ఇక ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో తివారీని ఏ జట్టు తీసుకోలేదు. రూ.50 లక్షల కనీస ప్రైజ్‌తో అతను అందుబాటులోకి రాగా ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబర్చలేదు. చివరిసారిగా తివారీ 2018లో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో మొత్తం 98 మ్యాచ్‌లు ఆడిన తివారీ..1695 రన్స్ చేశాడు. అయితే అతని బౌలింగ్ గణంకాలు అంత గొప్పగా ఏం లేకపోవడంతో చెన్నై జట్టులో అవకాశం దక్కే మార్గం ఏమాత్రం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications