Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లేటుగా వచ్చినా దుమ్ములేపాడుగా..5 మ్యాచ్‌లలో 10 వికెట్లు..బ్యాట్‌తోనూ మెరిశాడు..ప్లేఆఫ్‌లోకి SRH!!

IPL 2020: Impact of Jason Holder after including in the Sunrisers Hyderabad team

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌ చేరింది. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లతో గెలిచిన సన్‌రైజర్స్ .. సగర్వంగా మెగా టోర్నీలో ముందడుగు వేసింది. అయితే సీజన్ ప్రారంభంలో వార్నర్ సేన ఆట.. పడుతూ లేస్తూ సాగింది. కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్‌లలో గెలుపు ఖాయం అనుకున్న స్థితిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. కానీ చివరి మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌లపై ఘన విజయాలు సాధించి అనూహ్యంగా ప్లేఆఫ్‌ బెర్త్ ఖరారు చేసుకుంది.

5 మ్యాచ్‌లలో 10 వికెట్లు

5 మ్యాచ్‌లలో 10 వికెట్లు

ఒకానొక దశలో టోర్నీ రేసు నుంచి తప్పుకునేలా కనిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇంతలా పుంజుకుందంటే దానికి డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్స‌న్, రషీద్ ఖాన్. వీరితో పాటు సందీప్ శర్మ, షాబాద్ నదీమ్, వృద్ధిమాన్ సాహ, జాసన్ హోల్డర్‌ అద్భుతంగా రాణించారు. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ హోల్డర్‌ విశేషంగా ఆకట్టుకున్నాడు. కొత్త బంతితో చక్కగా బౌలింగ్ చేశాడు. ఐదు మ్యాచ్‌ల్లో పది వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇక బెంగళూరుపై 10 బంతుల్లోనే 26 రన్స్ బాది సన్‌రైజర్స్‌కు ఘన విజయం అందించి.. రన్ రేట్ అమాంతం పెంచేశాడు. బ్యాట్, బంతితో రాణించిన హోల్డర్‌ సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

వేలంలో కొనుగోలుచేయలేదు:

వేలంలో కొనుగోలుచేయలేదు:

జాసన్ హోల్డర్‌ జట్టులోకి వచ్చిన వేళావిశేషమేమో గానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల బాట పట్టింది. హోల్డర్‌ ఐదు మ్యాచులు ఆడితే.. సన్‌రైజర్స్ నాలుగు విజయాలు అందుకుంది. చివరగా ఆడిన ఐదు మ్యాచులలో పంజాబ్ జట్టుపై మాత్రమే సన్‌రైజర్స్ ఓడిపోయింది. బ్యాట్, బంతితో మెరుస్తున్న హోల్డర్‌.. ప్లేఆఫ్‌లో కూడా కీలకం కానున్నాడు. అయితే ఐపీఎల్ 2020 వేలంలో హోల్డర్‌ను సన్‌రైజర్స్ కొనుగోలుచేయలేదు. టోర్నీ ఆరంభంలోనే బెంగళూరుతో మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ స్థానంలో హోల్డర్‌ను తీసుకున్నది. హోల్డర్‌ టోర్నీలోకి లేటుగా అడుగు పెట్టినా.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

విలియమ్సన్ గాయపడడంతో

విలియమ్సన్ గాయపడడంతో

జాసన్ హోల్డర్‌ లేటుగా యూఏఈ వచ్చి క్వారంటైన్ పూర్తి చేసుకునేసరికి దాదాపు సగం సీజన్ పూర్తయింది. తుది జట్టులో నాలుగు విదేశీ ఆటగాళ్ల నిబంధన కారణంగా అతనికి ఆడే అవకాశం రాలేదు. అప్పటివరకు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ తుది జట్టులో ఆడారు. అయితే విలియమ్సన్ గాయపడడంతో.. ఆ స్థానంలో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హోల్డర్ ఆడాడు. ఆడడమే కాదు ఔరా అనిపించాడు. సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, రియాన్ పరాగ్‌లను ఔట్ చేశాడు. ఆపై సన్‌రైజర్స్ కెప్టెన్ బెయిర్‌స్టోను పక్కనపెట్టడంతో హోల్డర్‌ మరో నాలుగు మ్యాచులు ఆడాడు.

హోల్డర్‌ గణాంకాలు

హోల్డర్‌ గణాంకాలు

ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ లేని లోటును జాసన్ హోల్డర్‌ పూడ్చాడు. హోల్డర్‌, సందీప్ శర్మ, షాబాద్ నదీమ్, టీ నటరాజన్, రషీద్ ఖాన్ రాణించడంతో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ లేని లోటు ఎక్కడ కనబడడం లేదు.

4-0-33-3

4-0-27-2

4-0-46-1

4-0-27-2

4-0-25-2

ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనాకు బ్రెయిన్ సర్జరీ.. ఆందోళనలో ఫాన్స్!!

Story first published: Wednesday, November 4, 2020, 16:02 [IST]
Other articles published on Nov 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+