Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనాకు బ్రెయిన్ సర్జరీ.. ఆందోళనలో ఫాన్స్!!

Argentina football great Diego Maradona undergoes successful brain surgery

హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనాకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. మెుదుడులో రక్తం గడ్డకట్టుకపోవడంతో బ్యూనోస్ ఎయిర్స్‌లోని స్పెషలిస్ట్ ప్రైవేట్ క్లినిక్‌లో అడ్మిట్ అయిన మారడోనాకు మంగళవారం డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. ఆ శస్త్రచికిత్స విజయవంతమైంది. 'మారడోనా మెుదడుకు చేసిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. తలలో రక్తం గడ్డకట్టుకుపోవడంతో ఆపరేషన్ చేయించుకున్నారు' అని ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

ప్రస్తుతం డిగో మారడోనా పరిస్థితి నిలకడగానే ఉందని, కొద్ది రోజులు ఆరోగ్య పరిస్థితి సమీక్షించిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ లియోపోల్డో లుక్ తెలిపారు. మారడోనా పరిస్థితి బాలేదని తెలిసిన ఆయన అభిమానులు ఆసుపత్రికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. అతని బ్యానర్లతో 'క్షేమంగా రండి, డియెగో' అంటూ క్లినిక్ వెలుపల ఉత్కంఠగా ఎదురుచూశారు. శస్త్రచికిత్స అయ్యేంతవరకు ఆసుపత్రి గేట్ బయటే ఉన్నారు. శస్త్రచికిత్స విజయవంతమయ్యాక వారు ఊపిరి పీల్చుకున్నారు. ఆపై సంబరాలు చేసుకున్నారు.

స్వల్ఫ అస్వస్థతకు గురైనా డిగో మారడోనా లా ప్లాటాలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం మెుదడులో రక్త కట్టినట్లు గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. అనంతరం శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఆ క్లాట్‌ను తొలిగించారు. 60 ఏళ్ల మరడోనా పలు సమస్యలతో బాధనడుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు గుండెపోటు రాగా.. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అలాగే హెపటైటిస్‌ బారిన కూడా పడ్డారు.

గత శుక్రవారమే మారడోనా 60వ బర్త్ డేను జరుపుకున్నారు. పుట్టిన రోజును క్లబ్ ట్రైనింగ్ గ్రౌండ్‌లో పార్టీ ఇస్తుండగా.. అక్కడకు నడిచి రాలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. అసిస్టెంట్ల సహాయంతో నడిచి వచ్చిన మారడోనా.. కేవలం 30నిమిషాలు మాత్రమే అక్కడ ఉండి వెళ్లిపోయారు. ఇక మారడోనాకు డ్రగ్, ఆల్కహాల్ అలవాట్లు ఉన్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం మారడోనా బాడీ గార్డ్ కు కరోనా లక్షణాలు కనిపించాయి. అనుమానంతో టెస్టులు చేయించుకున్న మారడోనాకు మాత్రం నెగెటివ్ వచ్చింది.

Story first published: Wednesday, November 4, 2020, 14:59 [IST]
Other articles published on Nov 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+