Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: టైటిల్ స్పాన్సర్‌షిప్ రేసులో పతంజలి.. నెట్టింట పేలుతున్న జోక్స్, మీమ్స్!

IPL 2020 If Patanajali Sponsors This Season; Funny Trolls on Social Media

న్యూఢిల్లీ: ఓవైపు కరోనా దెబ్బతో పడిపోయిన అంతర్జాతీయ బ్రాండ్ మార్కెట్.. మరోవైపు చైనా వస్తు బహిష్కరణ సెగ.. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ వేటలో పడిన బీసీసీఐకి పతంజలి రూపంలో మంచి వార్త అందింది. ఐపీఎల్ 2020 సీజన్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు తాము సిద్ధమని ఆ కంపెనీ బహిరంగంగా ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ ఆధ్వర్యంలో పనిచేసే పతంజలి పూర్తిగా స్వదేశి కంపెనీ. ఈ సంస్థ ఆయుర్వేద మందులతో పాటు సబ్బులు, టూత్ పేస్ట్ వంటి ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది.

బీసీసీఐ ఒకే చెప్పెనా.?

బీసీసీఐ ఒకే చెప్పెనా.?

ఐపీఎల్‌తో జత కడితే తమ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నందని పంతంజలి భావిస్తోంది. ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ అంశం మా పరిశీలనలో ఉంది. మన భారతీయ కంపెనీపై అంతర్జాతీయ స్థాయిలో దృష్టి పడాలనేదే మా కోరిక. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు'అని పతంజలి అధికార ప్రతినిధి ఎస్కే తిజారావాలా చెప్పారు. పతంజలి గ్రూప్‌ ఏడాది టర్నోవర్‌ సుమారు రూ. 10 వేల కోట్లుగా ఉంది. మరోవైపు రేసులో అమెజాన్‌, బైజూస్‌, డ్రీమ్‌ 11 తదితర కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే బహుళ జాతీయ కంపెనీలు పోటీపడుతున్న క్రమంలో పతంజలికి బీసీసీ ఓకే చెబుతుందా? అన్నది తేలాలి. ఒకవేళ పతంజలితో కలిసి పనిచేస్తే బీసీసీఐకి కూడా ఈ టైమ్‌లో లాభం చేకూరినట్లే. ఎందుకంటే స్పాన్సర్లు దొరకని కష్టకాలంలో ఎంతో కొంత అండ లభించడంతో పాటు యాంటీ చైనా మూమెంట్‌కు చెక్ పెట్టినట్లు అవుతుంది.

కుళ్లు జోక్స్. మీమ్స్

కుళ్లు జోక్స్. మీమ్స్

ఒకవేళ పతంజలి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఖరారైతే ఎలా ఉంటుందనేదానిపై నెట్టింట కుళ్లు జోకులు, మీమ్స్ పేలుతున్నాయి. బాబా రాందేవ్ యోగాసనాలతో ఐపీఎల్ లోగో ఉండవచ్చని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ అనే అక్షరాలకు ముందు బాబా రామ్‌దేవ్ యోగాసనం.. అతని కాలుపై బ్యాట్‌ ఉండేలా రూపొందించిన లోగో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

 చీరగర్ల్స్‌కు పతంజలి డ్రెస్..

చీరగర్ల్స్‌కు పతంజలి డ్రెస్..

ఇంకొందరూ పతంజలి ఉత్పత్తులను ఉద్దేశించి వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. చీర్ గర్ల్స్‌కు క్యాబేజీ పొట్టుతో డ్రెస్ తయారు చేస్తారని, రాయితో పతంజలి బంతి, చెక్కతో బ్యాట్, మొక్కలతో వికెట్లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తారని ఫన్నీగా ఫొటోలు షేర్ చేస్తున్నారు.

 బాబా రాందేవ్ సైడ్ టర్న్..

బాబా రాందేవ్ సైడ్ టర్న్..

ఇక కరోనాకు మందు కనిపెట్టలేని రాందేవ్ బాబా.. ఐపీఎల్‌కు డైవర్ట్ అయ్యాడని కొంతమంది ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు. పతంజలి కంపెనీ నుంచి కరోనాకు మందు అంటూ కరోనిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మందుపై తీవ్రదుమారం రేగింది. దగ్గుమందు అని పర్మీషన్ తీసుకొని కరోనా మందు అని ప్రచారం చేస్తున్నారని ఆ కంపెనీ సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న అభిమానులు బాబా రాందేవ్ డైవర్ట్ తీసుకున్నాడని ఆడుకుంటున్నారు.

 నో ప్రాక్టీస్.. ఇక యోగానే..

నో ప్రాక్టీస్.. ఇక యోగానే..

ఇంకొందరైతే ఆటగాళ్లకు ప్రాక్టీస్ ఉండదని, మ్యాచ్‌కు ముందు యోగా చేస్తే సరిపోతుందని కామెంట్ చేస్తున్నారు. నెటి ప్రాక్టీస్ లేకున్నా.. యోగాతో మైదానంలో ఇరగదీస్తారని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు మీమ్స్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Story first published: Tuesday, August 11, 2020, 13:00 [IST]
Other articles published on Aug 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+