Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2020లో ఇంటర్వెల్‌.. మరి క్లైమాక్స్ సంగతేంటి!!.. ప్లేఆఫ్ చేరే జట్లు ఇవేనా?

IPL 2020: Here Is List Of Teams Which Will Qualify For Playoffs

హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020కి ‌ఇంటర్వెల్‌ ఆసన్నమైంది. టీ20 లీగ్‌‌ ఫస్ట్ హాఫ్ అద్భుతంగా సాగింది. ఓ రెండు జట్లు తప్ప అన్ని ఆకట్టుకున్నాయి. సోమవారం నాటికి ప్రతి జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడింది. లీగ్ దశలో జట్లన్నీ మరో ఏడేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇక ప్లేఆఫ్, ఫైనల్స్ లాంటి క్లైమాక్స్ ముందు ఉంది. అది ఇంకా రసవత్తరంగా సాగనుంది.

ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ గేర్‌లో దూసుకుపోయాయి. ఈ మూడు ప్లేఆఫ్ వెళ్లే అవకాశం ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ పర్వాలేదనిపించాయి. వీటికి కూడా అవకాశాలు ఉన్నాయి. టాప్-3 వెళితే.. వీటి మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మాత్రం నిరాశపరిచాయి. ఈ రెండు జట్లకు అతి తక్కువ ఛాన్స్ ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లేఆఫ్ వెళ్లవు. అయితే ప్లేఆఫ్ చేరే గణాంకాలు ఓ పరిశిలిద్దాం.

ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్

లీగ్ మొదటి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిన ముంబై .. తర్వాత బలంగా పుంజుకుంది. కోల్‌కతా మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. అయితే బెంగళూరుతో జరిగిన మ్యా‌చ్‌లో విజయం అంచుకు వెళ్లినా.. సూపర్ ఓవర్లో కంగుతింది. ఆపై ముంబై వెనుదిరి చూసుకోలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ముంబై విజయాలు అందుకుంది. ఐదు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు ఉండడం విశేషం. మిగిలిన 7 మ్యాచుల్లో 4 గెలిస్తే ముంబై ప్లేఆఫ్ వెళ్ళినట్టే. మూడు గెలిచినా అవకాశం ఉంటుంది.

ఢిల్లీ క్యాపిటల్స్:

ఢిల్లీ క్యాపిటల్స్:

ఈ సీజన్లో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ బాగా ఆడుతోంది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గతేడాది జట్టు బాధ్యతలు అందుకొని ప్లేఆఫ్స్‌ వరకూ తీసుకెళ్లాడు. ఆ అనుభవంతోనే ఈ ఏడాది కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ముంబై లాగే 5 విజయాలతో.. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. పంజాబ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో విజయం సాధించి ఔరా అనిపించింది. ముంబై, సన్‌రైజర్స్‌లకు మాత్రమే తలొంచింది. తొలిసారి ఐపీఎల్ కప్ కొట్టాలనే ఆశయంతో ఆ జట్టు ముందుకెళ్తోంది. ముంబై లానే మిగిలిన 7 మ్యాచుల్లో 4 గెలిస్తే ఢిల్లీ ప్లేఆఫ్ బెర్త్ ఖాయం.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

ఇన్ని రోజులు ఫామ్‌ కోల్పోయి సతమతమైన బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి బ్యాట్‌ ఝుళిపిస్తున్నాడు. ఏటా వరుస ఓటములతో ఈ పాటికే పాయింట్ల పట్టికలో వెనుకపడిపోయే ఆ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బౌలర్లు కూడా లయ అందుకోవడంతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించిన ఆర్సీబీ.. ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకో మూడు గెలిచినా ప్లేఆఫ్స్ వెళ్లొచ్చు.

కోల్‌కతా నైట్ రైడర్స్:

కోల్‌కతా నైట్ రైడర్స్:

టాప్‌-3 తర్వాత నిలిచిన జట్టు కోల్‌కతా. ఏడు మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు నాలుగింటిలో గెలుపొందింది. అందులో రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ ప్రతిభతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. కెప్టెన్ దినేశ్‌ కార్తీక్‌ ఫామ్ అందుకోవడం కలిసొచ్చే అంశం. శుభ్‌మన్ గిల్, ఇయాన్‌ మోర్గాన్‌, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ లాంటి ఆటగాళ్లు ఆ జట్టుకు కీలకం. కోల్‌కతా ప్రస్తుతం 4 విజయాలతో 8 పాయింట్లు సాధించింది. మరో మూడు మ్యాచులు గెలిస్తే.. ప్లేఆఫ్స్ వెళ్లొచ్చు. ఇక నాలుగు గెలిస్తే.. అధికారిక బెర్త్ ఖరారు అవుతుంది.

 సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఆరెంజ్ ఆర్మీ మరో ఐదు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. మిగతా సమీకరణలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోవచ్చు. ఒకవేళ నాలుగు గెలిస్తే.. అప్పటికి అవకాశం ఉంటుంది కానీ.. మిగతా జట్ల సమీకరణలపై ఆధారపడాలి. భువీ ఐపీఎల్ సీజన్‌కు దూరం కావడం కలవరపరుస్తోంది.

రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ ఏడు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఐపీఎల్ సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన రాజస్థాన్ తర్వాత వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇప్పటివరకు ఆడినట్లు ఆడితే సరిపోదు. ఇకపై దూకుడు పెంచాలి. లేదంటే ప్లేఆఫ్స్‌ అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం పొంచి ఉంది. హైదరాబాద్ లానే రాజస్థాన్ పరిస్థితి ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో గెలవాలి.

చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్

ఎప్పుడూ టాప్‌లో కొనసాగే చెన్నై ఈసారి పేలవ ఆటతీరుతో వెనకబడింది. సరైన బ్యాటింగ్‌ లైనప్‌ లేక ఇబ్బందులు పడుతోంది. ఇక్కడ రైనా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు వాట్సన్‌, డుప్లెసిస్‌ క్లిక్‌ అవుతున్నా మిగతా బ్యాట్స్‌మెన్‌ రాణించక ఓటమి పాలవుతోంది. కెప్టెన్‌గా, ఫినిషర్‌గా అత్యుత్తమ పేరున్న ఎంఎస్ ధోనీ సైతం మునుపటిలా ఆడలేకపోతున్నాడు. దాంతో ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పటికి రెండు విజయాలు మాత్రమే ఉండడంతో.. మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిస్తేనే ప్లేఆఫ్ బెర్త్ ఖాయం. ఒకటి రెండు ఓడిపోతే మాత్రం మిగతా జట్ల సమీకరణలపై ఆధారపడాలి. చెన్నై ఫామ్ చూస్తుంటే.. ఈసారి ప్లేఆఫ్స్‌ వెళ్లే అవకాశాలు తక్కువే.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

చివరిగా చెప్పుకోవాల్సింది పంజాబ్ గురించే. అన్ని విభాగాల్లో విఫలముతోంది. రాహుల్‌కు కెప్టెన్సీ కొత్త కావడం.. బౌలర్లు స్లాగ్ ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చుకోవడం... మిడిల్ ఆర్డర్ ఆదుకోకపోవడం లాంటివి పంజాబ్ ఓటమికి కారణాలు. మిగిలిన 7 మ్యాచుల్లో అన్నీ గెలిచినా.. అధికారిక బెర్త్ సందేహమే. టాప్ జట్లను ఎదుర్కొని 7 మ్యాచులు గెలవడం కష్టమే. మరో రెండు ఓడితే.. అధికారిక పంజాబ్ ఇంటిదారి పడుతుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ జట్టు ప్లేఆఫ్స్‌ వెళ్లదు.

2020 చివరిలోగా అతడు టీమిండియాకు ఆడతాడు: భారత మాజీ క్రికెటర్

Story first published: Tuesday, October 13, 2020, 17:03 [IST]
Other articles published on Oct 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+