For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టోక్స్ వస్తున్నాడు..ఇక ఆ ఇద్దరికి టైం దగ్గరపడింది..ఇప్పటికైనా ఫామ్ అందుకోకుంటే: గంభీర్ వార్నింగ్

IPL 2020: Gautam Gambhir slams Rajasthan Royals batsman Robin Uthappa for poor show

షార్జా: చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లాంటి పటిష్టమైన జట్లను ఓడించి ఐపీఎల్ 2020ని ఘనంగా ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ ఆపై తడబడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లలో ఓడి ఒక్కసారిగా డీలా పడిపోయింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ హాఫ్ సెంచరీలు చేశారు. కోల్‌కతా, బెంగళూరు మ్యాచులో ఇద్దరూ విఫలమయ్యారు. ఇక ఓపెనర్ జోస్ బట్లర్ 22, 21 పరుగులు చేస్తున్నా.. భారీ ఇన్నింగ్స్ ఇప్పటివరకు ఆడలేదు. దీంతో స్మిత్, శాంసన్‌లపైనే రాజస్థాన్ ఆడపడుతోంది.

ఉతప్పకు వార్నింగ్

ఉతప్పకు వార్నింగ్

టాప్ ఆర్డర్‌తో పాటు మిడిలార్డర్ వైఫల్యం కూడా రాజస్థాన్ ఓటములకు ప్రధాన కారణం. మిడిలార్డర్‌లో రాబిన్ ఉతప్ప, రియాన్‌ పరాగ్‌ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. దీంతో మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరగనున్న పోరుకు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ‌పరాగ్‌, ఉతప్పకు వార్నింగ్ ఇచ్చాడు. మిడిలార్డర్‌లో ఉతప్ప లాంటి అనుభవం ఉన్న ఆటగాడు అంచనాలను అందుకోవాలని సూచించాడు. ఫామ్ అందుకోకుంటే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం పొంచివుందని హెచ్చరించాడు. ఇక బెన్ స్టోక్స్ తిరిగి రావడంతో రాజస్థాన్ జట్టు జాతకం పూర్తిగా మారిపోతుందని గౌతీ అభిప్రాయపడ్డాడు.

సమయం మించిపోతోంది

సమయం మించిపోతోంది

తాజాగా ఈఎస్‌‍పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'రాబిన్ ఉతప్ప, రియాన్‌ పరాగ్‌కు సమయం మించిపోతోంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాడు ఉతప్ప ఫామ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. అతడు సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. ఉతప్ప మ్యాచ్‌లను తనదైన శైలిలో ముగిస్తాడు. అందుకే అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. మ్యాచ్‌లను ముగించలేకపోయినా.. మిడిల్ ఆర్డర్‌లో అతడు ఊపు తేవాలి' అని అన్నాడు. ఐపీఎల్ 2020లో ఉతప్ప ఇప్పటివరకు నాలుగు మ్యాచులలో 5, 9, 2, 17 రన్స్ చేశాడు.

స్టోక్స్ తిరిగి జట్టులోకి వస్తే

స్టోక్స్ తిరిగి జట్టులోకి వస్తే

'రాబిన్ ఉతప్పతతో పాటు రియాన్ పరాగా్ కూడా ఫామ్‌లో లేడు. బెంచ్‌ మీదున్న ఆటగాళ్లు సత్తా చాటడానికి ఎదురుచూస్తున్నారు. బెన్ స్టోక్స్ తిరిగి జట్టులోకి వస్తే.. కాంబినేషన్ పూర్తిగా మారిపోతుంది. ఒకానొక సమయంలో పోటీ ఎదురవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ ఇద్దరు ఫామ్‌లో రావాలి' అని గౌతమ్ గంభీర్ సూచించాడు. 'రాజస్థాన్ ఎక్కువగా జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్‌లపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఒకవేళ వారు విఫలమయితే సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే మిడిల్ ఆర్డర్‌ను పటిష్టం చేసుకోవాలి' అని గౌతీ చెప్పుకొచ్చాడు.

కార్తీక్‌ ఆరో స్థానంలో ఆడాలి

కార్తీక్‌ ఆరో స్థానంలో ఆడాలి

వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు. అతను బ్యాటింగ్‌ ఆర్డర్లో ముందు ఎందుకొస్తున్నాడన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై స్పందిస్తూ... 'రాహుల్‌ త్రిపాఠిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు పంపాలి. కార్తీక్‌ ఆరో స్థానంలో ఆడాలి. మోర్గాన్‌, రసెల్‌ల కన్నా ముందు బ్యాటింగ్‌కు దిగొద్దు. నరైన్‌ను ఎనిమిది లేదా తొమ్మిదో స్థానంలో ఆడించాలి. మోర్గాన్‌ 4లో, రసెల్‌ 5లో రావాలి. ఆ తర్వాత కార్తీక్‌ దిగాలి' అని చెప్పాడు.

ముంబై ఇండియన్స్ కారు అయితే.. మేం ముగ్గురమే ఇంజిన్.. ఇంధనం ఎక్కిస్తే దూసుకుపోతాం: పోలార్డ్

Story first published: Monday, October 5, 2020, 16:26 [IST]
Other articles published on Oct 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+