Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఇండియన్స్ కారు అయితే.. మేం ముగ్గురమే ఇంజిన్.. ఇంధనం ఎక్కిస్తే దూసుకుపోతాం: పోలార్డ్

IPL 2020: Kieron Pollard names three cricketers who are the engine of Mumbai Indians

దుబాయ్: ముంబై ఇండియన్స్‌ మరోసారి ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల‌ పట్టికలో అగ్ర స్థానానికి చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ ‌చేసిన ముంబైకి ఓపెనర్ క్వింటన్‌ డీకాక్‌ మంచి ఆరంభానిచ్చాడు. ఇక ఇన్నింగ్స్ చివరలో కీరన్ పోలా​ర్డ్‌, హర్దిక్‌ పాండ్యా, కృనాల్ పాండ్యాలు చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 208 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో తడబడిన హైదరాబాద్‌ 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేయగలిగింది.

మెరుపు హిట్టింగ్‌

మెరుపు హిట్టింగ్‌

భారీ హిట్టర్లతో కూడిన ముంబై ఇండియన్స్ చివరి ఐదు ఓవర్లలో భారీగా పరుగులు రాబడుతోంది. ఒక్కోసారి ఊహించని స్కోర్ చేస్తోంది. అందుకు ప్రధాన కారణం పోలా​ర్డ్‌, పాండ్యా సోదరులే. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ మంచి ఆరంభాలు ఇస్తే.. ఇన్నింగ్స్ చివరలో ఈ ముగ్గురు రెచ్చిపోతున్నారు. దీంతో ఒక్కోసారి ముంబై 200 పరుగులకు పైగా స్కోర్ చేస్తోంది. గత మ్యాచులో కూడా ఇదే జరిగింది. డికాక్ ‌(39 బంతుల్లో 67 పరుగులు; 4ఫోర్లు, 4సిక్స్‌లు) అర్ధ శతకం బాది మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. దీంతో హార్దిక్ (19 బంతుల్లో 28; 2ఫోర్లు, 2 సిక్స్‌లు), పొలార్డ్ ‌(13 బంతుల్లో 25, 3సిక్స్‌లు), కృనాల్ ‌(4 బంతుల్లో 20; 2ఫోర్లు, 2సిక్స్‌లు) మెరుపు హిట్టింగ్‌ చేశారు.

పోలార్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు

పోలార్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ముంబై ఇండియన్స్ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు చేయడంపై కీరన్ పోలార్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టు ఓ కారు అయితే.. తాను, పాండ్యా బ్రదర్స్ ఇంజిన్ లాంటి వాళ్లమన్నాడు. సరైన ఇంధనం ఎక్కిస్తే.. టాప్ గేర్‌లో దూసుకెళ్తామన్నాడు. 'పాండ్యా బ్రదర్స్, నేను కారులోని ఇంజిన్‌ రూంలా భావించుకుంటాం. ఇంజిన్ లేనిదే కారు కదలదు. మేం కూడా అంతే. మైదానంలోకెళ్లి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాం. కొన్ని సందర్భాల్లో ఇది జరుగుతుంది. కొన్నిసార్లు జరగదు. మాకు కావాల్సిందల్లా మంచి ఇంధనమే' అని పోలార్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

4 బంతుల్లో 20 పరుగులు

4 బంతుల్లో 20 పరుగులు

తొలి ఓవర్లోనే ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (6)ను సందీప్‌ శర్మ పెవిలియన్‌కు పంపాడు పేసర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ వేసిన మూడో ఓవర్‌లో డికాక్‌ ఒకటి, సూర్య కుమార్‌ మూడు ఫోర్లు బాదారు. అచితూచి ఆడుతున్న ఈ జోడిని కౌల్‌ ఆరో ఓవర్లో విడదీశాడు. సూర్యకుమార్ ‌(18 బంతుల్లో 27)ను ఔట్‌ చేశాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి ముంబై రెండు వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. ఆ తర్వాత డికాక్‌, ఇషాన్‌ కిషన్ ‌(31) నిలకడగా ఆడారు. అర్ధ శతకం తర్వాత కొన్ని భారీ షాట్లు ఆడిన డికాక్‌ను రషీద్‌ ఖాన్‌ బుట్టలో పడేశాడు. ఆ తర్వాత కిషన్‌ ఔటైనా.. హార్దిక్‌, పొలార్డ్‌ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కౌల్‌ వేసిన చివరి ఓవర్లో హార్దిక్‌ ఔట్‌ కాగా.. కృనాల్‌ 4 బంతుల్లో 20 పరుగులు చేసి స్కోరును 200 దాటించాడు.

క్యాచ్‌లను పట్టుంటే

క్యాచ్‌లను పట్టుంటే

ముంబై బ్యాట్స్‌మెన్‌ డికాక్‌, హార్దిక్‌, పొలార్డ్‌ ఇచ్చిన క్యాచ్‌లను చేజార్చి సన్‌రైజర్స్‌ మూల్యం చెల్లించుకుంది. ఏడో ఓవర్లోనే డికాక్‌ భారీ షాట్‌ కొట్టగా.. సన్‌రైజర్స్‌ ఫీల్డర్‌ మనీశ్‌ పాండేకి క్యాచ్‌ వెళ్లింది. అయితే పాండే వేళ్లను తాకుతూ అది సిక్స్‌ లైన్‌ దాటింది. అలాగే హార్దిక్‌ క్యాచ్‌ను సైతం 15వ ఓవర్లోనే వార్నర్‌ మిస్‌ చేశాడు. ఇక 18వ ఓవర్లో పొలార్డ్‌ క్యాచ్‌ను రషీద్‌ నేలపాలు చేశాడు. అయితే ఇషాన్‌ క్యాచ్‌ను మాత్రం మనీశ్‌ అద్భుతంగా పట్టాడు. మూడు క్యాచ్‌లు పట్టుంటే ముంబై భారీ స్కోర్ చేసేది కాదు.

ఆ 60 రోజులు మంచానికే పరిమితమయ్యా.. బంతిని పక్కనే పెట్టుకొని పడుకున్నా: షమీ భావోద్వేగం

Story first published: Monday, October 5, 2020, 15:18 [IST]
Other articles published on Oct 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+