For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అది మరే ఆటగాడి వల్ల కాలేదు.. ఢిల్లీ ఆటగాడిపై గంభీర్ ప్రశంసలు!

 IPL 2020: Gautam Gambhir lauds Delhi Capitals star-performer Shikhar Dhawan

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అతను సాధించిన ఘనత అమోఘమన్నాడు. ఈ ఫీట్ మరే భారత ఆటగాడికి సాధ్యం కాలేదని, ఐపీఎల్‌లోనే ఏ ఆటగాడు కూడా ఈ రికార్డు సాధించలేదని కొనియాడాడు. శిఖర్ సూపర్ ఫామ్ ఢిల్లీ జట్టుకు కలిసి వస్తుందని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్ షోలో మాట్లాడుతూ ఈ మాజీ ఓపెనర్ చెప్పుకొచ్చాడు.

'బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు, అది టీ20ల్లో అద్భుతం. ఈ ఘనతను అందుకోవడం మాములు విషయం కాదు. మరే భారత ఆటగాడి వల్ల కాలేదు. వాస్తవానికి ఐపీఎల్‌లోనే ఇప్పటి వరకు ఎవరూ ఈ ఘనతను అందుకోలేదు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ధావన్ ఈ ఘనతను అందుకున్న టైమ్. ఢిల్లీ జట్టు పీక్స్‌లో ఉన్నప్పుడు నమోదు కావడం విశేషం. ఇలా అనుభవజ్ఞుడైన ఆటగాడు సూపర్ ఫామ్‌లో ఉంటే ఆ జట్టుకు తిరుగుండదు. ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ జట్టు ఓపెనర్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేయడం, అంతుకు ముందు మ్యాచ్‌ల్లో 69, 57 హాఫ్ సెంచరీలు సాధించడం పెద్ద సానుకూలంశం. 'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో టాప్-2లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ దాదాపు ప్లే ఆఫ్‌కు చేరినట్టే. అయితే టేబుల్ టాపర్‌గా నిలవాలని శ్రేయస్ సేన భావిస్తోంది. మరికొద్ది క్షణాల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మరో పోరుకు సిద్దమైంది.

Story first published: Tuesday, October 27, 2020, 18:25 [IST]
Other articles published on Oct 27, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+