Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: ఫైనల్‌ మ్యాచ్‌లో మార్పులు ఉంటాయి.. అది అభిమానులకు సర్‌ప్రైజ్‌: రోహిత్

IPL 2020 Final, MI vs DC: Rohit Sharma hints Jayant Yadav played Final Match

దుబాయ్: మంగళవారం రాత్రి జరిగే ఐపీఎల్ 2020 ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, యువ సంచలనం ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఐదో టైటిల్‌పై గురి పెట్టగా.. లీగ్‌లో తొలిసారి ఫైనల్‌ చేరిన ఢిల్లీ అదే జోష్‌లో టైటిల్‌ను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాలనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో ముంబై హాట్‌ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ముంబై కెప్టెన్‌ రోహిత్ ‌శర్మ తమ సన్నద్దత గురించి మాట్లాడాడు. జట్టులో ఏ ఒక్కరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయమని పేర్కొన్నాడు.

ఏ ఒక్కరిపై ఆధారపడదు

ఏ ఒక్కరిపై ఆధారపడదు

రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'టోర్నీ మొదటి నుంచి ఒకటే చెబుతున్నా.. మా జట్టు ఏ ఒక్కరిపై ఆధారపడదు. జట్టులో ఏ ఒక్కరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రికార్డులే ఆటగాళ్ల ప్రతిభ గురించి చెపుతాయి. ఈ సీజన్‌లో సూర్యకుమార్‌ యాదవ్ ప్రదర్శన అద్భుతం. అలాంటి బ్యాట్స్‌మెన్‌ క్రీజులో ఉంటే.. నాన్‌స్ట్రైకర్‌‌పై ఒత్తిడి ఉండదు. ఎన్ని వికెట్లు కోల్పోయిందన్న విషయాన్ని అతడు పట్టించుకోడు. తన ఆట ఆడుతాడు. సూర్య నిలకడగా రాణిస్తున్నాడు. అది జట్టుకు లభించే అంశం. ఇషాన్ ‌కిషన్‌ సులభంగా సిక్సర్లు, ఫోర్లు కొడుతున్నాడు. మిడిల్‌ ఓవర్లలో రాహుల్‌ చహర్ వికెట్లు తీస్తున్నాడు' అని తెలిపాడు.

మార్పులు ఉంటాయి

మార్పులు ఉంటాయి

'ఫైనల్‌ మ్యాచ్‌కు జట్టులో మార్పులు ఉంటాయి. అది అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌లాంటిది. ఢిల్లీ జట్టులో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. వాళ్లను కట్టడి చేయాలంటే.. మా బౌలింగ్‌లో మార్పులు ఉండాలి. జయంత్ ‌యాదవ్‌ మాకొక మంచి అవకాశం. లీగ్‌ స్థాయిలో ఢిల్లీతో ఆడిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతను కూడా జట్టులో ఉండే అవకాశం ఉంది. గాయంతో బాధపడుతున్న ట్రెంట్ ‌బౌల్ట్‌ జట్టులో ఉంటాడా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పటికే ఎన్నో మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. మరోసారి అలాంటి ప్రదర్శనే చేస్తాడని ఆశిస్తున్నాం' అనిముంబై కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఢిల్లీపైనే ఒత్తిడి

ఢిల్లీపైనే ఒత్తిడి

'ఈ సీజన్‌లో ఢిల్లీతో ఆడిన మూడు మ్యాచుల్లోనూ మేం విజయం సాధించాం. ఆ ఫలితాలు ఢిల్లీపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. అయితే ఇది ఇది టీ20 ఫార్మాట్ అని మరవొద్దు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. కేవలం ఒకేఒక్క ఆటగాడు మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చగలడు. ఢిల్లీని తక్కువ అంచనా వేయబోం. అన్ని విభాగాల్లో రాణిస్తే.. ఐదో ట్రోఫీ గెలుస్తామనడంలో ఎలాంటి సందేహం లేదు. టాస్‌ గెలవడం ఈ మ్యాచ్‌లో కీలకం. ఏదైనా కానీ.. మా లక్ష్యం మ్యాచ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వడమే' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

IPL 2020: ఫైనల్ సెంటిమెంట్.. రోహిత్ శర్మ ఉంటే ఆ టీమ్!!

Story first published: Tuesday, November 10, 2020, 12:51 [IST]
Other articles published on Nov 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+