Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020 Final: అయ్యర్‌ కెప్టెన్‌ అయినప్పటికీ.. ధావన్‌ ముందుండి నడిపించాడు: స్టొయినిస్‌

https://telugu.mykhel.com/cricket/ipl-2020-final-mi-vs-dc-preview-mumbai-indians-eye-on-fifth-title-first-for-delhi-capitals-031490.html

దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ ఏడాది శిఖర్‌ ధావన్‌ నాయకత్వంలో నడిచిందని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ అన్నాడు. గబ్బర్ తన ఆటతీరుతో జట్టును ప్రభావితం చేశాడని ప్రశంసించాడు. ఈ సీజన్‌లో జట్టు కోసం ధావన్ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడినట్లు స్టోయినిస్‌ తెలిపాడు. భిన్న పరిస్థితుల్లో గొప్పగా ఎలా రాణించాలో ధావన్‌ నుంచి నేర్చుకుంటున్నానని చెప్పాడు. జట్టుకు శ్రేయాస్ అయ్యర్‌ కెప్టెన్‌ అయినప్పటికీ.. ధావన్‌ ఆటగాళ్లను ముందుండి నడిపించాడని స్టొయినిస్‌ పేర్కొన్నాడు.

 ఇదే నా మొదటి ఫైనల్:

ఇదే నా మొదటి ఫైనల్:

తాజాగా మార్కస్‌ స్టొయినిస్‌ మాట్లాడుతూ... 'బిగ్ బాష్ టోర్నీలో రెండు సీజన్లు ఓపెనింగ్ చేశా. ఐపీఎల్ 2020లో మళ్లీ ఆ అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇదే నా మొదటి ఫైనల్ మ్యాచ్. పిచ్ మీద పగుళ్లు ఉన్నాయి కాబట్టి ఆరంభంలో ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ముంబై ఇండియన్స్ చాలా మంచి జట్టు. నిలకడగా ఆడుతోంది. ఆ జట్టులోని ఆటగాళ్లు అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. మేము ఉత్తమ క్రికెట్ ఆడితే సరిపోతుంది. టైటిల్ గెలుస్తాం' అని అన్నాడు.

 అయ్యర్‌ కెప్టెన్‌ అయినప్పటికీ:

అయ్యర్‌ కెప్టెన్‌ అయినప్పటికీ:

'ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ ఏడాది శిఖర్‌ ధావన్‌ నాయకత్వంలో గొప్పగా నడిచింది. గబ్బర్ తన ఆటతీరుతో జట్టును ప్రభావితం చేశాడు. ఈ సీజన్‌లో జట్టు కోసం ధావన్ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. భిన్న పరిస్థితుల్లో గొప్పగా ఎలా రాణించాలో ధావన్‌ నుంచి నేర్చుకుంటున్నా. జట్టుకు శ్రేయాస్ అయ్యర్‌ కెప్టెన్‌ అయినప్పటికీ.. ధావన్‌ ఆటగాళ్లను ముందుండి నడిపించాడు. ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నాం. మాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి' అని ఢిల్లీ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్ చెప్పాడు. తొలిసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరిన ఢిల్లీ మంగళవారం డిఫెడింగ్ ఛాంపియన్‌ ముంబైతో తుది పోరులో తలపడనుంది.

 రెండు శతకాలు:

రెండు శతకాలు:

లీగ్‌ ఆరంభంలో విజయాలతో దూకుడుగా ఆడిన ఢిల్లీ చివర్లో వరుస ఓటములతో ఒత్తిడిలోకి వెళ్లింది. ఈ సమయంలో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో శిఖర్ ధావన్‌ జట్టులో జోష్‌ నింపాడు. లీగ్‌లో ఇప్పటి వరకూ రెండు శతకాలు బాదిన ధావన్‌.. 603 పరుగులు చేశాడు. ఆదివారం జరిగిన కీలకమైన క్వాలిఫైయర్‌-2 మ్యాచులోనూ 78 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడానికి కారణమయ్యాడు. ఇప్పటికే ఆరువందలకు పైగా పరుగులు చేసిన ధావన్‌కు ఫైనల్‌లో భారీ స్కోరు చేసే బాధ్యత మీదుంది.

352 పరుగులు.. 12 వికెట్లు:

352 పరుగులు.. 12 వికెట్లు:

ధావన్‌తో పాటు ఢిల్లీ తరఫున మంచి ప్రదర్శన చేస్తున్న స్టొయినిస్‌ లీగ్‌లో 352 పరుగులు చేసి 12 వికెట్లు తీశాడు. ఆదివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ఓపెనర్‌గా వచ్చిన స్టొయినిస్‌..‌ 38 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు వేసి మూడు కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్‌ చేజారుతుందనే సమయంలో ఫామ్‌లో ఉన్న మనీశ్ ‌పాండేతో పాటు కేన్ విలియమ్‌సన్‌ను ఔట్‌ చేసి ఢిల్లీ విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు.

IPL 2020 Final: ఐదో టైటిల్‌ వేటలో ముంబై.. లీప్ ఇయర్ ఢిల్లీని గెలిపిస్తుందా!!

Story first published: Tuesday, November 10, 2020, 9:38 [IST]
Other articles published on Nov 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+