
కోహ్లీ ఫోన్ నంబర్ కోసం
అయితే కొంతమంది అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబితే కిక్కేం ఉంటుందని.. విరాట్ కోహ్లీ ఫోన్ నంబర్ సంపాదించి పర్సనల్‌గానే విష్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. తమ అభిమాన క్రికెటర్ బర్త్‌డేను మరింత ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునేందుకు.. గూగుల్ సాయం అడుగుతున్నారు. కోహ్లీ ఫోన్ నంబర్ కోసం చాలా మంది గూగుల్‌లో వెతికారు. దీంతో గూగుల్ ఇండియా సెర్చ్‌లో కోహ్లీ పర్సనల్ నంబర్‌కు సంబంధించిన అంశం ట్రెండింగ్‌లో నిలిచింది. టాప్ సర్చింగ్‌లో డొనాల్డ్ ట్రంప్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో 'విరాట్ కోహ్లీ ఫోన్ నంబర్' ట్రెండ్ అవుతోంది. మొత్తానికి విరాట్ ఫోన్ నంబర్ అడుగుతున్నారు ఫాన్స్.

ఎమోషనల్ బర్త్ డే విషెస్
విరాట్ కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్విటర్ వేదికగా ఓ ఎమోషనల్ బర్త్ డే విషెస్ చెప్పింది. జట్టు గెలుపు కోసం రక్తాన్ని, స్వేదాన్ని, కన్నీళ్లను ఇచ్చే గొప్ప వ్యక్తి అని ట్వీట్ చేసింది. మా నాయకుడు లెజెండ్ అని ప్రశింసిస్తూ.. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. కెప్టెన్ కోహ్లీ పుట్టినరోజు వేడుక అతని విధ్వంసక బ్యాటింగ్ కంటే ఎక్కువగా జరిగిందని మరో ట్వీట్‌లో పేర్కొంది. 2008 ఐపీఎల్ ప్రారంభం నుంచి లీగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఐపీఎల్ అధికారక ట్విటర్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన వీడియోను షేర్ చేసింది.

ఐడియా కప్ ద్వారా అరంగేట్రం
1988 నవంబర్ 5 వతేదీన ఢిల్లీలో జన్మించిన విరాట్ కోహ్లీ అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా కెప్టెన్‌గా ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాలో 2008లో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్‌లో సెంచరీ సాధించిన తర్వాత కోహ్లీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరూ గాయపడినప్పుడు 2008లో శ్రీలంకతో ఆడిన ఐడియా కప్ ద్వారా మొదటిసారి వన్డే మ్యాచ్ ఆడాడు. అక్కడి నుంచి అతనికి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. కోహ్లీ భారత్ తరఫున 86 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 7240, వన్డేల్లో 11867, టీ20లలో 2794 పరుగులు చేశాడు.
191 ఐపీఎల్ మ్యాచ్‌లు
ఇక క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ.. జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 191 మ్యాచ్‌లు ఆడాడు. 5872 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో లీగ్ దశలో 460 పరుగులు చేశాడు. 2016 తర్వాత ప్లేఆఫ్‌కి వెళ్లడానికి కోహ్లీ చేసిన పరుగులు చాలా కీలకమయ్యాయి. శుక్రవారం ఎలిమినేషన్ మ్యాచ్‌లో హైదరాబాద్‌తో తలపడనుంది.


Click it and Unblock the Notifications

అరుదైన ఘనత.. 1000 విజయాలు!!