Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరుదైన ఘనత.. 1000 విజయాలు!!

Rafael Nadal got 1000 career wins

పారిస్‌: 20 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్, స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్​ అరుదైన రికార్డు నెలకొల్పాడు. పురుషుల సింగిల్స్​ విభాగంలో వెయ్యవ విజయాన్ని సాధించాడు. ఫ్రాన్స్​లో జరుగుతున్న పారిస్ మాస్టర్స్ రెండవ రౌండులో బుధవారం ఆ దేశానికే చెందిన ఫెలిసియానో లోపెజ్​ను 4-6, 7-6 (5), 6-4 తేడాతో ఓడించి నాదల్​ ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు. టూర్‌ లెవెల్‌ టెన్నిస్‌లో వెయ్యవ విజయాన్ని స్వంతం చేసుకున్న 34 ఏళ్ల నాదల్.. ఈ ఘనతను సాధించిన నాలుగవ వ్యక్తిగా నిలిచాడు.

1000వ మ్యాచ్​లో విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని రఫెల్ నాదల్‌కు ఓ ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. ఇప్పటికే 1000 విజయాల మార్కును సాధించిన వారిలో జిమ్మీ కోనర్స్ (1274), రోజర్‌ ఫెదరర్‌ (1242), ఇవాన్‌ లెండీ (1068) ఉన్నారు. ప్రపంచంలోని ప్రసిద్ద క్రీడల్లో ఒకటి టెన్నిస్. అందులో అరుదైన గౌరవం అందుకోవడం కష్టమే. అయితే అందులో మొత్తం 1000 విజయాలు సాధించిన ఆటగాళ్లకు ప్రత్యేకత ఉంటుంది.

తన కెరీర్లో గొప్ప విజయాన్ని సాధించినట్టు స్పెయిన్ బుల్ రఫెల్‌ నాదల్‌ ప్రకటించాడు. 'నా కెరీర్లో గొప్ప విజయం ఇది. ఇన్ని మ్యాచ్​ల్లో విజయాలు అంటే నా వయసు పెరుగుతున్నట్లే. చాలా ఏళ్లుగా నేను ఆటలో కొనసాగుతూ విజయాలు సాధిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని నాదల్ మ్యాచ్​ అనంతరం పేర్కొన్నాడు.

'ఈ నెంబర్ (1000) ఎంతో స్పెషల్. దీన్ని పంచుకునేందుకు జనాలు లేకపోయినా.. నాకు ఇది చెప్పలేనంత ప్రత్యేకం' అన్న రఫెల్‌ నాదల్ మాటలను పారిస్‌ మాస్టర్స్ అధికారిక వెబ్ సైట్ ప్రచురించింది. అయితే ఎవరూ ఓటమిని అంగీకరించొద్దనీ, తాను ఓ బాల్ బాయ్‌గానే టెన్నిస్ జీవితానని ఆరంభించానని క్లే కోర్ట్ కింగ్ తెలిపాడు.

గాయాల రూపంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా.. పలు విషయాల పట్ల గర్వపడుతున్నానని రఫెల్‌ నాదల్‌ వెల్లడించాడు. ఊహించని రీతిలో ఇబ్బంది పెట్టే సంఘటనలు తన కెరీర్లో తారసపడినా.. ముందుకు సాగాలనే సంకల్పంతోనే కొనసాగినట్టు తెలిపాడు. ఏప్రిల్‌ 2002లో తొలి గెలుపును నమోదు చేసేప్పటికి నాదల్‌ వయస్సు పదిహేనేళ్లు. 1000వ మ్యాచ్​లో విజయం సాధించినప్పుడు 34 ఏళ్లు.

Story first published: Thursday, November 5, 2020, 15:48 [IST]
Other articles published on Nov 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+