
ఊహకు కూడా అందలేదు:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్‌పై ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో విశ్లేషించాడు. 'రాహుల్ టీమ్ కోల్‌కతాను ఓ మోస్తారు స్కోరుకే పరిమితం చేసింది. అది ఛేదించదగిన స్కోర్. అలానే పంజాబ్ ఆడిన తీరు ఊహకు కూడా అందలేదు. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించాక విజయం వైపు నడవాలి. మయాంక్ (56) ఔటయ్యాక చివరి 5 ఓవర్లలో 48 పరుగులు చేయాల్సిన స్థితిలోనూ ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉన్నాయి' అని చెప్పాడు.

అనుభవజ్ఞులను పంపలేదు:
'ధాటిగా ఆడే క్రమంలో నికోలస్ పూరన్ (16) ఔటైనా పంజాబ్ గెలవడానికి అప్పటికీ అవకాశాలున్నాయి. అయితే ఇక్కడే ఆ జట్టు తీరు నన్ను ఆశ్చర్యం కలిగించింది. పూరన్ పెవిలియన్ చేరాక అనుభవం లేని ప్రభు సిమ్రన్‌ను బరిలోకి దింపారు. మన్‌దీప్, మాక్స్‌వెల్ లాంటి అనుభవజ్ఞులను పంపలేదు. ప్రభు సిమ్రన్ కుదురుకునేలోపే రన్‌రేట్ ఆమాంతం పెరిగిపోయింది. ఆ సమయంలోనూ పంజాబ్ ఓడిపోదు. అయినా ఆ జట్టు ఓటమిపాలైంది. చాలా నిరాశ చెందా' అని ఆకాశ్ చోప్రా తెలిపాడు. పంజాబ్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడగా కేవలం ఒక్క విజమే సాధించింది. 2 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగతా అన్ని మ్యాచ్‌లు మెరుగైన రన్‌రేట్‌తో విజయాలు సాధించాలి.

మహీ ఎలా ముందుకు వెళతారు:
ఇక చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లేఆఫ్స్‌కు చేరాలంటే చాలా కష్టపడాల్సి ఉందని ఆకాశ్ చోప్రా చెప్పాడు. 'మహీ ఇక్కడి నుంచి ఎలా ముందుకు వెళతారు.. చూస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తోంది. ఇప్పటికే సగం సీజన్ పూర్తి అయినందున చెన్నై మెరుగవుతుందని ఆశించాము. ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండే గెలుపొందడంతో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాల్సి ఉంది. ఇకపై ఆడాల్సిన 7 మ్యాచ్‌ల్లో 6 గెలిస్తే అక్కడ చోటు దక్కుతుంది. ఒకవేళ 5 గెలిచినా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చెన్నై ఆ 5 విజయాలు సాధిస్తుందా అనేదే అసలైన ప్రశ్న' అని మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. చెన్నై ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలే సాధించి ఆరో స్థానంలో నిలిచింది.
MI vs DC: డికాక్, సూర్యకుమార్ మెరుపు హాఫ్ సెంచరీలు.. ఢిల్లీపై ముంబై విజయం!!


Click it and Unblock the Notifications












