KXIP vs DC: ఐపీఎల్‌లో ఐదువేల పరుగులు.. ఐదో ప్లేయర్‌గా శిఖర్ ధావన్ రికార్డు!!

దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఐదువేల పరుగుల మార్కును పూర్తి చేసుకున్నాడు. మంగళవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఫలితంగా ఐపీఎల్‌లో ఐదువేల పరుగులు సాధించిన ఐదో ప్లేయర్‌గా గబ్బర్ నిలిచాడు. పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు ఐదు వేల పరుగులు చేరడానికి 62 రన్స్ దూరంలో ధావన్ ఉన్నాడు. మ్యాచ్‌లో 106 పరుగులు సాధించడం ద్వారా ధావన్ ఐపీఎల్ పరుగులు 5,043కు చేరాయి.

ఐదో ప్లేయర్‌గా:
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ ఐదుగురు క్రికెటర్లు మాత్రమే ఐదు వేల పరుగుల మార్కును అందుకున్నారు. ఇందులో నాలుగురు భారత ఆటగాళ్లు ఉండటం గమనార్హం. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ నెం.1 స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 5,759 పరుగులు చేశాడు. సురేశ్ రైనా (5,368), రోహిత్ శర్మ (5,158), డేవిడ్ వార్నర్ (5,037), శిఖర్ ధావన్ (5,003) టాప్-5లో ఉన్నారు. కోహ్లీ, రైనా మినహా మిగిలిన ముగ్గురు క్రికెటర్లు ఐపీఎల్ 13వ సీజన్‌లోనే ఐదు వేల పరుగుల మార్కును అందుకోవడం విశేషం.

వరుసగా రెండు సెంచరీలు:
సెంచరీ చేయడంతో శిఖర్ ధావన్ మరో ఘనతను కూడా నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా గబ్బర్ రికార్డుల్లోకి ఎక్కాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ధావన్ శతకం పూర్తి చేసుకున్నాడు. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై శిఖర్ ధావన్ (101 నాటౌట్: 58 బంతుల్లో 14ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీ బాదాడు. ఐపీఎల్‌లో వరుసగా రెండు శతకాలు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్ ధావనే కావడం విశేషం. ఇక సెంచరీలు బాదిన రెండు మ్యాచులలో కూడా అజేయంగా నిలవడం మరో విశేషం.

రెండు అంతకంటే ఎక్కువ శతకాలు:
ఐపీఎల్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన బ్యాట్స్‌మెన్ లేరు కానీ ఒకే సీజన్‌లో రెండు అంతకంటే ఎక్కువ శతకాలు నమోదు చేసిన ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ 2016 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 4 శతకాలు నమోదు చేయగా.. 2011లో బెంగళూరుకి ఆడిన క్రిస్ గేల్ రెండు సెంచరీలు బాదాడు. 2017లో పంజాబ్‌కి ఆడిన హసీమ్ ఆమ్లా రెండు శతకాలు నమోదు చేయగా.. 2018లో చెన్నై తరఫున ఆడిన షేన్ వాట్సన్ కూడా రెండు సెంచరీలు చేశాడు. తాజా శిఖర్ ధావన్ ఆ జాబితాలో చేరాడు.

నాలుగు మ్యాచ్‌ల్లో 50కి పైగా పరుగులు:
పంజాబ్‌తో మ్యాచ్‌లో 106 పరుగులు చేసిన ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్.. సీఎస్‌కేతో జరిగిన గత మ్యాచ్‌లో కూడా సెంచరీ సాధించాడు. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ధావన్ 69 నాటౌట్, 57 పరుగులు బాదాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో 50కి పైగా పరుగుల్ని ధావన్ సాధించడం ఇక్కడ విశేషం. ఇప్పటికే ధావన్ హాఫ్ సెంచరీల రికార్డు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.
'జట్టు అవసరాల కోసం ఓపెనింగ్ చేస్తా.. మిడిలార్డర్‌లో ఆడుతా!! దేనికైనా సిద్దమే'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications