For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌ను వదలని మహమ్మారి.. ఢిల్లీ క్యాపిటల్స్‌లో కరోనా టెన్షన్‌!!

IPL 2020: Delhi Capitals assistant physiotherapist tests positive for Coronavirus

దుబాయ్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020ని కరోనా వైరస్‌ మహమ్మారి వదలడం లేదు. ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభం కాకముందే ఆయా ఫ్రాంచైజీ సభ్యుల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అసిస్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్‌ కరోనా బారిన పడ్డాడు. దుబాయ్‌కు చేరుకున్నాక అతనికి నిర్వహించిన తొలి రెండు కరోనా పరీక్షలు నెగెటివ్‌ రాగా.. మూడో పరీక్షలో మాత్రం అతనికి పాజిటివ్‌ వచ్చిందని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఆదివారం తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.

షెడ్యూల్ విడుదలైన గంటల వ్యవధిలోనే

షెడ్యూల్ విడుదలైన గంటల వ్యవధిలోనే

ఐపీఎల్ 2020 పూర్తి షెడ్యూల్‌‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ కరోనా కేసు వెలుగులోకి రావడం గమనార్హం. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఆగస్టు 20న అక్కడికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చేరుకుంది. అయితే అప్పుడు జట్టుతో కలిసి వెళ్లని ఆ జట్టు అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్.. ఆలస్యంగా ఇటీవల యూఏఈకి వెళ్లాడు. ఈ క్రమంలో క్వారంటైన్‌లో ఉన్న అతనికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది.

అతడు ఎవరినీ కలవలేదు

అతడు ఎవరినీ కలవలేదు

'అతడు ఇంకా జట్టులో చేరలేదు. ఆటగాళ్లు లేదా సహాయక సిబ్బంది ఎవరినీ కలవలేదు. అతడికి పాజిటివ్‌ అని తెలియగానే క్వారంటైన్‌కు తరలించాం. ప్రస్తుతం దుబాయ్‌లోని ఐపీఎల్‌ ఐసోలేషన్‌ కేంద్రంలో ఉన్నాడు. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నాక అప్పుడు మళ్లీ రెండు సార్లు పరీక్షలు చేయించుకొని నెగిటివ్‌గా వస్తేనే.. జట్టుతో కలుస్తాడు. మా ఫ్రాంఛైజీ వైద్య సిబ్బంది అతడితో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం' అని ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

అంతకుముందు రాజస్థాన్‌ ఫీల్డింగ్‌ కోచ్‌కు

అంతకుముందు రాజస్థాన్‌ ఫీల్డింగ్‌ కోచ్‌కు

అంతకుముందు రాజస్థాన్‌ రాయల్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ దిశంత్‌ యగ్నిక్‌ దుబాయ్‌కు రాకముందే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. యగ్నిక్‌ 14 రోజుల క్వారంటైన్‌తో పాటు మళ్లీ రెండుసార్లు నిర్వహించిన నిర్ధరణ పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చింది. దీంతో అతడిప్పుడు జట్టుతో కలిసే అవకాశం వచ్చింది. యూఏఈ చేరుకున్నాక చెన్నై సూపర్‌ కింగ్స్‌లో ఏకంగా 13 మంది వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. పేసర్ దీపక్‌ చాహర్‌, బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ మినహా.. మిగిలిన 11 మంది మొత్తం సహాయక సిబ్బందే. చాహర్‌, రుతురాజ్‌ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. 14 రోజుల క్వారంటైన్‌ తర్వాత నిర్వహించే పరీక్షల్లో నెగిటివ్‌ వస్తే అప్పుడు జట్టుతో చేరుతారు.

CSK: ఆ వన్డేని ఎలా మర్చిపోగలం.. నెం.3లోనే ధోనీ బ్యాటింగ్ చేయాలి: రైనా

Story first published: Monday, September 7, 2020, 12:43 [IST]
Other articles published on Sep 7, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+