For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK: ఆ వన్డేని ఎలా మర్చిపోగలం.. నెం.3లోనే ధోనీ బ్యాటింగ్ చేయాలి: రైనా

Suresh Raina feels MS Dhoni should replace him at No.3 for Chennai Super Kings

ముంబై: ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌తో కలిసి యూఏఈకి వెళ్లిన సురేశ్ రైనా.. గత వారం టోర్నీ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో మెగా టోర్నీ నుంచిశ్ తప్పుకుంటున్నట్లు రైనా స్పష్టం చేశాడు. అతని స్థానంలో చెన్నై ఫ్రాంఛైజీ ఇంకా ఎవరినీ తీసుకోలేదు. కరోనా బారిన పడిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. నెం.3లో ఆడుతాడని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే తన స్థానంలో కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడితే బాగుంటుందని తాజాగా రైనా అభిప్రాయపడ్డాడు.

నెం.3లోనే ధోనీ ఆడాలి:

నెం.3లోనే ధోనీ ఆడాలి:

'టీమిండియాకి ఆడే సమయంలో నెం.3లో ఆడిన అనుభవం చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీకి ఉంది. 2005 ఏప్రిల్ నెలలో విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో సునామి సృష్టించాడు. పాకిస్థాన్‌పై మూడో స్థానంలో ఆడి 148 పరుగులు చేసిన ఆ వన్డేని అంత సులువుగా ఎలా మర్చిపోగలం. జట్టులో నెం.3 బ్యాటింగ్ స్థానం చాలా కీలకం. ఆ స్థానానికి అనుభం ఉన్న ధోనీ అయితే న్యాయం చేయగలడు' అని సురేశ్ రైనా పేర్కొన్నాడు. మహీ శ్రీలంకపై కూడా 183 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

 సుదీర్ఘకాలం నెం.3లోనే:

సుదీర్ఘకాలం నెం.3లోనే:

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సుదీర్ఘకాలం నెం.3లో ఆడిన సురేశ్ రైనా.. 'మిస్టర్ ఐపీఎల్'‌గా కితాబులు అందుకున్నాడు. మ్యాచ్ గమనానికి బట్టి వేగంగా పరుగులు చేసేవాడు. భారీ లక్ష్య ఛేదనలో బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును అమాంతం పెంచేవాడు. అతడు క్రీజులో ఉన్నాడంటే.. మ్యాచ్ మనదే అన్న నమ్మకం అభిమానులది. అంతలా ప్రభావం చూపాడు. ఇప్పటి వరకూ 193 మ్యాచ్‌లాడి 137.11 స్ట్రైక్‌రేట్‌తో 5,368 పరుగులు చేశాడు. దాంతో రైనా స్థానంలో ఆడే క్రికెటర్ కూడా ఆ స్థాయిలో ఆడాలని అందరూ అనుకుంటున్నారు. ధోనీ అయితే ఆ స్థానానికి బాగా సెట్ అవుతాడని రైనా అంటున్నాడు.

అనుభవజ్ఞుడైన ఆటగాడు అవసరం:

అనుభవజ్ఞుడైన ఆటగాడు అవసరం:

కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కూడా నెం.3లో ఎంఎస్ ధోనీ ఆడాలని ఇంతకుముందే సూచించాడు. 'నెంబర్ 3లో బ్యాటింగ్ చేయడానికి ధోనీకిదే సువర్ణావకాశం. గత ఏడాదిగా అతను ఆటకు దూరంగా ఉన్నాడు. కాబట్టి బంతులను ఎక్కువగా వృథా చేస్తూ యాంకర్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా భారత తరఫున అలానే ఆడాడు. కాబట్టి ధోనీ ఫస్ట్ డౌన్‌లో వస్తే ఆ సమస్యను అధిగమించవచ్చు. ఒక వేళ ధోనీ మూడో స్థానంలో వచ్చినా.. కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, సామ్ కరన్‌లతో లోయరార్డర్ బలంగా ఉంటుంది. ధోనీ కూడా ఈ స్థానంలో ఆడటాన్ని ఆస్వాదిస్తాడనుకుంటున్నా. రైనా దూరమవడంతో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయడానికి సీఎస్‌కేకు ఓ అనుభవజ్ఞుడైన ఆటగాడు అవసరం' అని అన్నాడు.

జోరుగా ప్రాక్టీస్‌:

జోరుగా ప్రాక్టీస్‌:

ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు నెట్‌ ప్రాక్టీస్‌ కొనసాగిస్తోంది. కరోనా బారిన పడిన పేసర్‌ దీపక్‌ చాహర్‌, బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌.. క్వారంటైన్ సమయంలో ఉన్న డుప్లెసిస్, ఎంగిడి మినహా మిగతా ఆటగాళ్లందరూ సాధన చేస్తున్నారు. ప్రాక్టీస్‌ సెషన్‌లో ధోనీ.. పియూశ్‌ చావ్లా, రవీంద్ర జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌ వంటి బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. స్పిన్‌, పేస్‌ బౌలింగ్‌లో దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను చెన్నై సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది.

Story first published: Saturday, September 5, 2020, 21:03 [IST]
Other articles published on Sep 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+