Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHఫ్యాన్స్‌కు వాగ్దానం చేస్తున్నా..అదే జరిగితే..బుట్టబొమ్మ సాంగ్‌కు మళ్లీ డ్యాన్స్ చేస్తా: వార్నర్

IPL 2020, DC vs SRH: Will do the Butta Bomma song again, David Warner promise to SRH fans

అబుదాబి: యాభై రోజులుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్‌ 2020 ఆఖరి అంకానికి చేరుకుంది. క్వాలిఫయర్‌-1లో అద్భుత విజయంతో ముంబై ఇండియన్స్ తుదిపోరులో అడుగుపెడితే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగనున్న క్వాలిఫయర్‌-2తో మరో ఫైనలిస్ట్‌ ఎవరో ఈరోజు తేలిపోనుంది. గత నాలుగు మ్యాచ్‌లు నెగ్గి ఊపు మీదున్న సన్‌రైజర్స్..‌ ఈ రోజు కూడా గెలవాలని ఫాన్స్ కోరుకుంటారు. మరోవైపు ఐపీఎల్ 2020 టైటిల్ గెలవడమే ఫ్యాన్స్‌కు సన్‌రైజర్స్ ఇచ్చే అత్యుత్తమ గిఫ్ట్ అని ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. అంతేకాదు ఫ్యాన్స్‌కు ఓ వాగ్దానం చేశాడు.

సన్‌రైజర్స్ నా కుటుంబం

సన్‌రైజర్స్ నా కుటుంబం

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టైటిల్ గెలిస్తే.. తన ఫేవరేట్ బుట్టబొమ్మ సాంగ్‌కు మళ్లీ డ్యాన్స్ వేస్తానని డేవిడ్ వార్నర్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌కు వాగ్దానం చేశాడు. భారత్ తనకు రెండో ఇల్లు లాంటిదని.. సన్‌రైజర్స్ తనకు కుటుంబంతో సమానమని పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ తరఫున రాణించడం తనకెంతో ఆనందంగా ఉందన్నాడు. ఏళ్ల తరబడి మేనేజ్‌మెంట్ తనకు ఎంతగానో మద్దతుగా నిలిచిందని వార్నర్ చెప్పుకొచ్చాడు. డేవిడ్ వార్నర్ శనివారం స్పోర్ట్స్ టుడేతో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నాడు.

బుట్టబొమ్మ సాంగ్‌కు డ్యాన్స్ వేస్తా

బుట్టబొమ్మ సాంగ్‌కు డ్యాన్స్ వేస్తా

'హైదరాబాద్ అభిమానులందరికీ నేను ఓ వాగ్దానం చేస్తున్నా. ఐపీఎల్ 2020 టైటిల్ గెలిస్తే.. నా ఫేవరేట్ బుట్టబొమ్మ సాంగ్‌కు మళ్లీ డ్యాన్స్ వేస్తా. కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తా. భారత్ నాకు రెండో ఇల్లు అయితే.. సన్‌రైజర్స్ నా కుటుంబం. ఈ ఫ్రాంచైజ్ పట్ల నాకు చాలా ఇష్టం ఉంది. సన్‌రైజర్స్ జట్టు వచ్చిన రెండో సంవత్సరం తర్వాత నేను కలిశాను. వేలం పాటలో నాకు చాలా మద్దతు దక్కింది. మేనేజ్‌మెంట్ మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. నేను జట్టులో లేనప్పుడు కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్ భాద్యత తీసుకున్నారు' అని డేవిడ్ వార్నర్ తెలిపాడు.

ఫ్యాన్స్ ముఖాల్లో చిరునవ్వు నింపుతాం

ఫ్యాన్స్ ముఖాల్లో చిరునవ్వు నింపుతాం

'ఐపీఎల్ 2020 టైటిల్ గెలవడమే ఫ్యాన్స్‌కు సన్‌రైజర్స్ ఇచ్చే అత్యుత్తమ గిఫ్ట్. ఆరెంజ్ ఆర్మీ ఐపీఎల్‌లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఫాన్స్ మమల్ని ఎంతో ఆదరించారు. వారు లేకుండా మేము లేము. వారి మద్దతుకు కృతజ్ఞతలు. వారి ముఖాల్లో చిరునవ్వు నింపుతాం. ఐపీఎల్ 2020 టైటిల్ గెలుస్తాం. బుట్టబొమ్మ సాంగ్‌కు మళ్లీ డ్యాన్స్ వేస్తా' అని హైదరాబాద్ కెప్టెన్ పేర్కొన్నాడు. కీలక మ్యాచ్‌లకు ముందు ఒత్తిడి ఉంటుందని, ఇలాంటి మ్యాచ్‌లు సరదాగా ఉంటాయన్నాడు. మ్యాచ్‌కు ముందు ఏ పని చేసినా ధ్యాస మొత్తం ఆట మీదే ఉంటుందన్నాడు. ప్రశాంతంగా మైదానంలో బరిలో దిగి ప్లాన్ ప్రకారం ఆడితే సరిపోతుందని డేవిడ్ వార్నర్ చెప్పాడు.

టిక్‌టాక్‌లో స్టార్

టిక్‌టాక్‌లో స్టార్

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. టిక్‌టాక్‌లో అడుగుపెట్టిన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ రోజుకో వీడియోతో అభిమానులను అలరించాడు. తన పిల్లలు, సతీమణితో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియోలు సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. ఇక హిట్‌సాంగ్‌ 'బుట్ట బొమ్మ'‌కు తన సతీమణి క్యాండిస్‌తో కలిసి చిందేసి టిక్‌టాక్‌లో స్టార్ అయ్యాడు. ఇప్పుడు కప్ కొడితే మళ్లీ చేస్తానంటున్నాడు.

విరాట్ కోహ్లీ కవ్వించాడు.. మనీష్‌ పాండే సిక్స్‌ కొట్టాడు (వీడియో)

Story first published: Sunday, November 8, 2020, 16:04 [IST]
Other articles published on Nov 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+