Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ కవ్వించాడు.. మనీష్‌ పాండే సిక్స్‌ కొట్టాడు (వీడియో)

IPL 2020, SRH vs RCB: Manish Pandey gives perfect response to Virat Kohlis Sledge

అబుదాబి: టీమిండియా సారథి, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడు. సారథ్యం విషయంలో అయినా.. పరుగులు చేయడంలో అయినా విరాట్ ఇలానే ఉంటాడు. ఇక తన స్లెడ్జింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించేందుకు, ఏకాగ్రతను దెబ్బ తీసేందుకు కూడా వెనుకాడడు. టీమిండియా తరఫునైనా.. ఐపీఎల్‌లో అయినా కొన్నిసార్లు ఇదే పంథా సాగిస్తుంటాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ 2020లో ఓ ఆటగాడిని రెచ్చగొట్టాడు. శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆ ఘటన జరిగింది.

కోహ్లీ కవ్వించాడు

132 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆరంభంలోనే ఓపెనర్‌ గోస్వామి (0) వికెట్‌ కోల్పోయింది. తొలి ఓవర్‌లోనే మొహమ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌లో ఏబీ డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి అతడు వెనుతిరిగాడు. అనంతరం మనీష్‌ పాండే (24) క్రీజులోకి వచ్చాడు. మూడో ఓవర్‌ను సిరాజ్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు. మొదటి రెండు బంతులు ఆడిన మనీష్‌.. డాట్ బాల్స్ చేశాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ.. ఆజ్‌ నహీ మారేగా షాట్ ‌(ఈ రోజు అతడు షాట్‌ ఆడడు) అంటూ మనీశ్‌ వైపు చూసి తప్పుడు షాట్‌ ఆడేలా కవ్వించాలని ప్రయత్నించాడు.

పాండే ఓ భారీ సిక్సర్

పాండే ఓ భారీ సిక్సర్

అయితే తర్వాతి బంతికే చక్కటి పుల్‌షాట్‌తో మిడ్‌వికెట్‌ మీదుగా మనీష్ పాండే ఓ భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. దాంతో కోహ్లీకి సున్నింతంగానే తన ఉద్దేశం చాటిచెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోహ్లీ ప్రవర్తన సరిగా లేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా లీగ్‌ దశలో కొద్ది రోజుల క్రితం ముంబైతో తలపడిన సందర్భంలోనూ విరాట్ ఇలాగే ప్రవర్తించాడు. సూర్యకుమార్‌ను స్లెడ్జింగ్‌ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓటమి

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓటమి

ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్‌-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆదివారం రాత్రి తలపడనుంది. గెలవక తప్పని మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 131/7 స్కోర్ సాధించగా.. అనంతరం హైదరాబాద్‌ 4 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కేన్ విలియమ్సన్ ‌(50), జేసన్‌ హోల్డర్ ‌(24) చివరి వరకూ ఆజేయంగా నిలిచి జట్టును గెలిపించారు.

పది మ్యాచుల్లో 7 గెలిచి

పది మ్యాచుల్లో 7 గెలిచి

ఎన్నో ఆశలతో ఐపీఎల్ 2020లో కోహ్లీసేన అడుగుపెట్టింది. తొలి పది మ్యాచుల్లో 7 గెలిచి 14 పాయింట్లు సాధించి దుమ్మురేపింది. ఆపై హఠాత్తుగా ప్రదర్శనలో మార్పు కనిపించింది. చివరి నాలుగు లీగ్ మ్యాచుల్లో ఓడిపోయింది. అయితే ఆఖరి మ్యాచులో ఢిల్లీ 17.3 ఓవర్ల తర్వాత లక్ష్యం ఛేదించడంతో మెరుగైన రన్‌రేట్‌ వల్ల ప్లేఆఫ్స్‌ చేరుకుంది. ఎలిమినేటర్‌ పోరులో హైదరాబాద్‌తో తలపడి ఓటమి పాలైంది.

Story first published: Sunday, November 8, 2020, 15:10 [IST]
Other articles published on Nov 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+