DC vs RR: థ్రిల్లింగ్ గేమ్‌లో రాజస్థాన్‌పై ఢిల్లీ సూపర్ విక్టరీ!

దుబాయ్: ఐపీఎల్ 13 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకెళ్తుంది. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ 13 పరుగులతో అద్భుత విజయాన్నందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), శ్రేయస్ అయ్యర్(43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా.. జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు పడగొట్టాడు. కార్తీక్ త్యాగి, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసింది. బెన్ స్టోక్స్(35 బంతుల్లో 6 ఫోర్లతో 41), రాబిన్ ఊతప్ప(27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో తుషార్, నోర్జ్ రెండేసి వికెట్లు తీయగా.. రబడా, అశ్విన్, అక్సర్ పటేల్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో ఢిల్లీ అగ్రస్థానాన్ని అందుకోగా.. రాజస్థాన్ తమ ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.

ధాటిగా ఆరంభించినా..
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(9 బంతుల్లో 22) ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. కానీ ఆ జోరును కొనసాగించలేకపోయారు. అన్రిచ్ నోర్జ్ వేసిన మూడో ఓవర్‌లో ఓ సిక్స్, రెండు బౌండరీలతో ధాటిగా ఆడిన జోస్ బట్లర్.. ఆఖరి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఈ ఓవర్ ఐదో బంతిని 156 కిలోమీటర్ల వేగంతో విసిరి ఈ లీగ్‌లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన నోర్జ్.. ఆ మరుసటి బంతికే వేగాన్ని తగ్గించి బట్లర్‌ను బోల్తా కొట్టించాడు.
ఇక స్పిన్నర్ అశ్విన్ వేసిన మరుసటి ఓవర్‌లోనే కెప్టెన్ స్టీవ్ స్మిత్(1) రిట్నర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌తో స్టోక్స్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీలుచిక్కిన బంతులను బౌండరీలకు తరలించాడు.

అయ్యర్‌కు గాయం..
అయితే బంతిని ఆపే క్రమంలో ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. అతని భుజం నేలకు బలంగా తాకడంతో నొప్పితో విలవిలలాడాడు. వెంటనే మైదానం వీడాడు. దాంతో శిఖర్ ధావన్ మ్యాచ్‌కు కెప్టెన్సీ మహించాడు. ఇక పవర్ ప్లే ముగిసే సరికి రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 47 రన్స్ చేసింది. అక్సర్ పటేల్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టి శాంసన్ టచ్‌లోకి వచ్చాడు. మరో వైపు స్టోక్స్ కూడా బౌండరీలు బాదాడు.
ఇక హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్లిన స్టోక్స్‌ను దేశ్ పాండే బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే అక్సర్ పటేల్ అద్బుత బంతికి శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోయినా ఊతప్ప భారీ షాట్లు ఆడుతూ రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నాడు. ఆ క్రమంలోనే యువ ఆటగాడు రియాన్ పరాగ్(1) రనౌట్‌కు కారణమయ్యాడు.

చెలరేగిన ఢిల్లీ బౌలర్లు..
ఇక దేశ్ పాండే, అశ్విన్, రబడ వరుసగా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం తగ్గింది. ఇక 18వ ఓవర్‌లో నోర్జ్ వేసిన మూడో బంతికి ఊతప్ప(32) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఈ ఓవర్‌లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక ఢిల్లీ విజయానికి చివరి 12 బంతుల్లో 25 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్ వేసిన రబడా ఓ వికెట్ తీసి మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
ఇక చివరి ఓవర్‌లో రాజస్థాన్ విజయానికి 22 పరుగులు అవసరం కాగా.. తుషార్ దేశ్ పాండే వైడ్‌తో ఓవర్‌ను ప్రారంభించాడు. ఇక రాహుల్ తేవాటియా భారీ షాట్ ఆడగా బౌండరీ లైన్ మీద అజింక్యా రహానే సూపర్ ఫీల్డింగ్‌తో ఐదు పరుగులు సేవ్ చేశాడు. అనంతరం శ్రేయస్ గోపాల్ వికెట్ తీయడంతో ఢిల్లీ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications