DC vs RR: బుల్లెట్ బాల్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతి.. స్పీడ్ ఎంతంటే?

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌లో దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు తరఫున ఆడుతున్న నోర్జ్.. యూఏఈ పిచ్‌లపై ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తిస్తున్నాడు. నోర్జ్ వేసే బంతులకు బ్యాట్స్‌మెన్ వద్ద సమాధానమే లేకుండా పోతోంది. ఇక పరుగులు చేయడం గగనంగా మారుతోంది. అత్యంత వేగవంతమైన బంతులతో ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా అన్రిచ్ నోర్జ్ రికార్డుల్లోకి ఎక్కాడు.

అత్యంత వేగవంతమైన బంతి
బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ పేసర్ అన్రిచ్ నోర్జ్.. గంటకు 156.2 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బంతిని సంధించాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా నోర్జ్ నిలిచాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో భాగంగా నోర్జ్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి ఈ రికార్డును సాధించాడు. అయితే ఆ బంతిని రాజస్థాన్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ బౌండరీకి తరలించాడు. నోర్జ్ ఆ తర్వాతి బంతిని కూడా 155.1 గంటకు కిలోమీటర్ల వేగంతో సంధించాడు. ఈసారి బట్లర్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆ బంతికి అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

స్టెయిన్ రికార్డు బద్దలు
అన్రిచ్ నోర్జ్ 156.2 గంటకు కి.మీ వేగంతో విసరడంతో దక్షిణాఫ్రికాకు చెందిన సహచర బౌలర్ డేల్ స్టెయిన్ (154.4 గంటకు కిలోమీటర్లు) ఫాస్టెస్ట్ రికార్డును బ్రేక్ చేశాడు. ప్రతీ మ్యాచ్‌లో సగటున 150 ప్లస్ వేగంతో బంతులేస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మొదటి మూడు వేగవంతమైన బంతులు రికార్డు ఇప్పుడు దక్షిణాఫ్రికా పేసర్ పేరిట ఉన్నాయి. అంతకుముందు 155.21 కి.మీ, 154.74 కి.మీ వేగంతో బంతలు వేశాడు. ఈ సీజన్‌లో 150 కి.మీ వేగంతో వేస్తున్న బంతులు బౌలర్ నోర్జ్. ఆ తర్వాత స్థానంలో రాజస్తాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. ఈ సీజన్‌లో 150 కి.మీ వేగాన్ని దాటిన తొలి బౌలర్ ఆర్చర్. కానీ ఇప్పుడు వేగంలో ఆర్చర్‌కు నోర్జే పోటీగా వచ్చాడు.

క్రిస్ వోక్స్ స్థానంలో అన్రిచ్ నోర్జ్
ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ స్థానంలో అన్రిచ్ నోర్జ్ అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చాడు. అతడ్ని ఢిల్లీ యాజమాన్యం రూ.20 లక్షలకే దక్కించుకోవడం గమనార్హం. వచ్చే ఏడాది మనోడికి భారీ డిమాండ్ ఉండనుందని అంచనా. ఇప్పటి వరకూ నోర్జ్ ఆడిన 8 మ్యాచుల్లో 7.34 ఎకానమీతో 10 వికెట్లు తీశాడు. గత మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా కూడా నిలిచాడు.

ఆ విషయం నాకు తెలియదు
బౌలింగ్ వేసే సమయంలో అత్యంత వేగవంతమైన బంతి విసిరిన విషయం తనకే తెలియదని నోర్జ్ చెప్పాడు. 'మ్యాచ్ తర్వాత అందరూ అంటుంటే ఆ విషయం తెలుసుకున్నా. నా బౌలింగ్ వేగాన్ని పెంచుకునేందుకు నేను చాలా కష్టపడుతున్నా. బట్లర్‌కు బౌలింగ్ చేయడం అంటే కఠినమైన సవాల్‌ను స్వీకరించినట్లే. అతను స్కూప్ షాట్లు బాగా ఆడతాడనే విషయం నాకు తెలుసు. తొలి బంతికి స్కూప్ షాట్ ఆడిన అతను తర్వాతి బంతికి కూడా అలాగే ఆడతాడని నేను అనుకోలేదు. మళ్లీ ఆ షాట్ ఆడటం వల్లే అతను ఔటయ్యాడు. పిచ్ ప్రవర్తనను మా జట్టు బౌలర్లు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ఈ విజయం సాధ్యమైంది' అని పేర్కొన్నాడు.
RCB vs KXIP: జోష్‌లో బెంగళూరు.. పంజాబ్‌కు చావోరేవో.. గేల్ గెలిపిస్తాడా!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications