For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs RCB: సెకండ్ ప్లేస్ ఎవరిదో? ఇలా ఆడితే ఓడినా కోహ్లీసేనకు ప్లే ఆఫ్ బెర్త్!

IPL 2020, DC vs RCB: Who will win Royal Challengers Bangalore and Delhi Capitals

అబుదాబి: పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచే జట్టుకు ఫైనల్‌‌ చేరేందుకు రెండు అవకాశాలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌‌లో టాప్‌‌-2 ప్లేస్‌‌ కోసం సోమవారం జరిగే కీలక మ్యాచ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌, రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గెలిచిన టీమ్‌‌ సెకండ్‌‌ ప్లేస్‌‌ను దక్కించుకుంటే, ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్‌‌ కష్టమవుతుంది. మిగతా జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ గందరగోళాన్ని తప్పించుకునేందుకు ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీ 59 పరుగులతో ఆర్‌సీబీని చిత్తుచేసింది. దాంతో ఈ ఓటమిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీసేన భావిస్తుంది.

చతికిలపడిన ఢిల్లీ..

చతికిలపడిన ఢిల్లీ..

టోర్నీ ఫస్ట్‌‌ హాఫ్‌‌లో వరుస విజయాలు సాధించిన ఢిల్లీ.. చివర్లో చతికిలపడింది. బ్యాటింగ్‌‌లో ఫర్వాలేదనిపిస్తున్నా.. బౌలింగ్‌‌లో చేతులెత్తేయడం ఆందోళన కలిగిస్తున్నది. ఓపెనింగ్‌‌లో నిలకడగా ఆడే ప్లేయర్లు లేకపోవడం కూడా ప్రతికూలాంశం. పృథ్వీ షా, అజింక్యా రహానే, శిఖర్ ధావన్‌‌ కాంబినేషన్‌‌ కుదురుకోవడం లేదు. వరుస సెంచరీలతో హోరెత్తించిన ధావన్‌‌.. లాస్ట్‌‌ మూడు మ్యాచ్‌‌ల్లో 0, 0, 6 రన్స్‌‌ మాత్రమే చేశాడు. బిగ్‌‌ హిట్టర్లు రిషభ్ పంత్, శ్రేయస్‌ అయ్యర్‌ కూడా విఫలమవుతున్నారు. వీరు చెలరేగితే ఢిల్లీ బ్యాటింగ్ కష్టాలు తీరినట్లే. ఇక తొలి అంచె పోటీల్లో సూపర్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను దడ పుట్టించిన కగిసో రబడా, నోర్జ్, అశ్విన్, అక్షర్ పటేల్ గత నాలుగు మ్యాచ్‌లుగా తేలిపోయారు. ఈ కీలక మ్యాచ్‌లో వారు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది.

బెంగళూరు కూడా ఒత్తిడిలోనే..

బెంగళూరు కూడా ఒత్తిడిలోనే..

మరోవైపు ఆర్‌‌సీబీ కూడా మూడు పరాజయాలతో ఒత్తిడిలో ఉంది. దీంతో టీమ్‌‌ బ్యాలెన్స్‌‌, ఫామ్‌‌పై సందేహాలు మొదలయ్యాయి. బ్యాటింగ్‌‌లో ఎక్కువగా కోహ్లీ, డివిలియర్స్‌‌పైనే ఆధారపడటం బలహీనతగా మారింది. లాస్ట్‌‌ రెండు గేమ్‌‌ల్లోనూ ఈ ఇద్దరు పెద్దగా రాణించలేదు. ఆరోన్‌‌ ఫించ్‌‌ స్థానంలో వచ్చిన జోష్‌‌ ఫిలిప్ ఆకట్టుకోలేకపోతున్నాడు. పడిక్కల్ కూడా నిలకడగా రాణించడం లేదు. మిడిలార్డర్, లోయరార్డర్ బలహీనంగా ఉంది. బౌలర్లు కూడా తేలిపోతున్నారు. చాహల్ చెలరేగుతున్నా ఇతర బౌలర్ల అండలేకపోయింది. క్రిస్ మోర్రిస్, సిరాజ్, ఉడానా మెరవాల్సి ఉంది.

ఇలా ఓడితేనే ప్లే ఆఫ్స్ బెర్త్..

ఇలా ఓడితేనే ప్లే ఆఫ్స్ బెర్త్..

ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 7 గెలిచి 14 పాయింట్లతో ఆర్‌సీబీ, ఢిల్లీ 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంటుంది. ఓడిన టీమ్ భవితవ్యం మాత్రం.. హైదరాబాద్- ముంబై మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఏ సమస్యలేదు. కానీ ఓడితే మాత్రం మెరుగైన రన్‌రేట్ కారణంగా హైదరాబాద్ టాప్-3లో నిలుస్తోంది. అప్పుడు నాలుగో స్థానం కోసం ఆర్‌సీబీ, ఢిల్లీ మ్యాచ్‌లో ఓడిన జట్టు కోల్‌కతా మధ్య పోటీ నెలకొంటుంది. రన్‌రేట్ కీలకం అవుతుంది. కాబట్టి రన్ రేట్ మెరుగ్గా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 22 పరుగుల వ్యత్యాసంతో లేదా 18 బంతులు మిగిలుండగా ఓడిపోవద్దు. ఇక ఢిల్లీ 20 పరుగులు, 15 బంతుల వ్యత్యాసంతో పరాజయం పాలవద్దు.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్, జోష్ ఫిలిప్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (కీపర్), గుర్‌క్రీత్ సింగ్, ఇసురు ఉడానా, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోర్రిస్, నవ్‌దీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, షిమ్రాన్ హెట్‌మైర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, అశ్విన్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్, ప్రవీణ్ దూబే

IPL 2020 playoffs: 3 జట్లు ఔట్.. 3 స్థానాల కోసం 4 టీమ్స్ మధ్య పోటీ.. 13 ఏళ్ల చరిత్రలోనే ఫస్ట్ టైమ్!

Story first published: Monday, November 2, 2020, 9:48 [IST]
Other articles published on Nov 2, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+