Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs MI: చెలరేగిన బుమ్రా.. పసలేని ఢిల్లీ బ్యాటింగ్.. ముంబై ముందు స్వల్ప లక్ష్యం!

Jasprit Bumrah, Trent Boult help MI restrict DC

దుబాయ్: ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా (3/17), ట్రెంట్ బౌల్ట్ (3/21) అద్భుత బౌలింగ్‌కు మెరుపు ఫీల్డింగ్ కూడా తోడవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మె‌న్ దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్ల ధాటికి పసలేని బ్యాటింగ్‌తో పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో కీలకమైన మ్యాచ్‌లో శ్రేయస్ సేన.. ముంబై ముందు 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(25), రిషభ్ పంత్ (21)‌తో సహా అంతా విఫలమవడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 రన్స్ చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా, బౌల్ట్ మూడేసి వికెట్లు తీయగా.. కౌల్టర్ నీల్, చాహర్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ సిల్వర్ డక్ కాగా.. పృథ్వీ షా(10) తన వైఫల్యాన్ని కొనసాగించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అయ్యర్, పంత్ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ చాహర్ బౌలింగ్‌లో డికాక్ సూపర్ కీపింగ్‌తో అయ్యర్ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.

ఈ వికెట్‌తో ఢిల్లీ పతనం మొదలైంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పంత్, స్టోయినిస్(2), హెట్‌మైర్(11), హర్షల్ పటేల్(5), అశ్విన్ (12) మూకుమ్మడిగా విఫలమయ్యారు. చివర్లో రబడా(13) ఓ సిక్సర్ కొట్టడంతో ఢిల్లీ 100 పరుగుల మార్క్‌ను ధాటగలిగింది.

Story first published: Saturday, October 31, 2020, 17:22 [IST]
Other articles published on Oct 31, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+