Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs CSK: అతడు బేబీ సెహ్వాగ్.. అచ్చం అలానే ఆడుతున్నాడు: గ్రేమ్ స్వాన్

IPL 2020, DC vs CSK: Prithvi Shaw is like baby Sehwag, Graeme Swann’s huge praise for Delhi Openar

దుబాయ్: టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత గ్రేమ్ స్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. పృథ్వీ షా అచ్చం వీరేంద్ర సెహ్వాగ్‌లానే దూకుడుగా ఆడుతున్నాడని పేర్కొన్నాడు. అంతేకాదు.. ఢిల్లీ ఓపెనర్‌ను బేబీ సెహ్వాగ్‌గా గ్రేమ్ స్వాన్ అభివర్ణించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. 8 మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో గెలిచి 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ విజయాల్లో షా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

సెహ్వాగ్ మాదిరిగానే:

సెహ్వాగ్ మాదిరిగానే:

ఐపీఎల్ 2020లో యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షా దూకుడుగా ఆడుతూ పరుగులు చేస్తున్నా.. నిలకడగా మాత్రం రాణించలేకపోతున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 25కిపైగా సగటుతో 202 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత మూడు మ్యాచ్‌ల్లో పృథ్వీ షా భారీ స్కోర్లు నమోదు చేయలేకపోయాడు. వేగంగా ఆడే క్రమంలో వికెట్ చేజార్చుకుంటున్నాడు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ మాదిరిగానే.. షా కూడా క్రీజులోకి వచ్చి రావడంతోనే బౌండరీలతో విరుచుకుపడుతాడు. జట్టుకు వేగంగా పరుగులు అందిస్తాడు.

పాంటింగ్ నవ్వుతూ కనిపిస్తున్నాడు:

పాంటింగ్ నవ్వుతూ కనిపిస్తున్నాడు:

శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షో క్రికెట్ కనెక్టెడ్ తాజా ఎపిసోడ్‌లో వ్యాఖ్యాత గ్రేమ్ స్వాన్ మాట్లాడాడు. 'ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కోచ్ రికీ పాటింగ్‌ జట్టును బాగా నడిపిస్తున్నారు. శ్రేయస్ చాలా మంచి నాయకుడు. అతడి సారథ్యం బాగుంది. ఇక ఢిల్లీ మ్యాచ్‌లు ముగియగానే పాంటింగ్ నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఇంగ్లండ్ జట్టుతో ఆస్ట్రేలియా మ్యాచ్‌లు జరిగినప్పుడు పాంటింగ్ ఇలా ఎప్పుడూ నవ్వలేదు' అని స్వాన్ అన్నాడు.

 అతను బేబీ సెహ్వాగ్:

అతను బేబీ సెహ్వాగ్:

'పృథ్వీ షా బ్యాటింగ్ చేసే విధానం నాకెంతో నచ్చుతుంది. అతను బేబీ సెహ్వాగ్ లాంటివాడు. సెహ్వాగ్ యొక్క ఇంకో వెర్షన్ షా అని నా అభిప్రాయం. వీరూ లానే.. షా కూడా క్రీజులోకి వచ్చి రావడంతోనే బౌండరీలతో విరుచుకుపడుతాడు. నాకెంతో ఇష్టమైన భారత క్రికెటర్లలో సెహ్వాగ్ ఒకడు' అని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ స్వాన్ తెలిపాడు. సెహ్వాగ్ 2.0నే షా అని చెప్పకనే చెప్పాడు. ఢిల్లీ జట్టు బలంగా ఉందని, ఆత్మవిశ్వాసంతో ఆడుతోందని అతడు చెప్పుకొచ్చాడు.

33 ఐపీఎల్ మ్యాచులలో 800 రన్స్:

33 ఐపీఎల్ మ్యాచులలో 800 రన్స్:

పృథ్వీ షా భారత్ తరపున 4 టెస్టులు ఆడి 335 రన్స్ చేశాడు. ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు వన్డేల్లో 84 పరుగులు బాదాడు. ఇక 33 ఐపీఎల్ మ్యాచులలో 800 రన్స్ బాదాడు. 6 అర్ధ శతకాలు ఉన్నాయి. గత 12 సీజన్లలో టైటిల్ నెగ్గలేకపోయిన ఢిల్లీ.. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో ఉంది. అందుకు తగ్గట్టే వరుస విజయాలతో దూసుకెళుతోంది. ప్లే ఆఫ్ మాత్రం కచ్చితంగా చేరే అవకాశం ఉంది.

క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన స్టార్ బౌలర్!!

Story first published: Saturday, October 17, 2020, 10:42 [IST]
Other articles published on Oct 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+