
దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లకు ఆరు మ్యాచ్‌ల్లో 5 గెలిచి పాయింట్స్ టేబుల్లో టాప్‌లో కొనసాగుతుంది. ఆల్‌రౌండ్ షోతో ఎంతటి బలమైన జట్టునైనా ఓడిస్తుంది. ఇక సూపర్ పెర్ఫామెన్స్ కనబరుస్తున్న తమ ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి ఢిల్లీ ఫ్రాంచైజీ కో ఓనర్ పార్త్ జిందాల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.
ఆటగాళ్లంతా ఫ్యామిలీలను వదిలి దుబాయ్‌కు వచ్చి జట్టుతో ఆడుతున్నారు. పైగా బయోబబుల్‌లో క్లిష్ట పరిస్థితుల మధ్య ఉంటున్నారు. దీంతో తమ ఆటగాళ్ల కోసం వినూత్నంగా ఆలోచించిన జిందాల్.. ఆటగాళ్లందరిని వారి కుటుంబాలకు దగ్గర చేసే ప్రయత్నం చేశాడు. ప్లేయర్ కుటుంబ సభ్యుల వీడియో బైట్స్‌ను ప్లే చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ ఊహించని బహుమతికి ఆటగాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీ హీరో మార్కస్ స్టోయినిస్ అయితే తమ కుటుంబాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. కోచ్ పాంటింగ్‌తో సహా అందరి కుటుంబ సభ్యుల వీడియో బైట్స్‌ను ప్లే చేశారు. అంతేకాకుండా ఆటగాళ్లందరి కుటుంబ సభ్యుల ఫొటో ఫ్రేమ్‌లను గిఫ్ట్‌గా ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఢిల్లీ తమ అధికారిక ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఢిల్లీ, దుబాయ్, ప్రపంచంలో మరెక్కడా జరిగినా తమ ఆటగాళ్లకు కుటుంబ సభ్యులను దగ్గరగా ఉంచుతామని, తమ ఛైర్మన్ కో ఓనర్ పార్త్ జిందార్ ఆటగాళ్లకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడని క్యాప్షన్‌గా పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.