
పేపర్ మీద రాసి చూస్తే:
మ్యాచ్‌కు ముందు డేవిడ్ వార్నర్ ఓ మీడియాతో మాట్లాడుతూ యాజమాన్యం తమపై పూర్తి నమ్మకంతో ఉందని చెప్పాడు. తామంతా ఒక జట్టుగా విజయం సాధించడానికే ఇక్కడ ఆడుతున్నట్లు తెలిపాడు. 'ప్రతీ ఆటగాడు తన వ్యక్తిగత పాత్ర ఏంటో తెలుసుకోవడం, తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడమనేవి మాకు చాలా ముఖ్యమైన విషయాలు. పేపర్ మీద రాసి చూస్తే.. మాకంటే బలమైన జట్లు కనిపిస్తాయి. అయితే మేం ఏం చేయగలమనే విషయంపైనే ఆధారపడతాం. ఇప్పటివరకైతే మేం సరైన మార్గంలోనే పయనిస్తున్నాం' అని వార్నర్ పేర్కొన్నాడు.

ఆరంభంలో మా గురించి మాట్లాడరు:
'ఐపీఎల్ టోర్నీ ఆరంభానికి ముందు మా గురించి ఎవరూ మాట్లాడరు. ఫైనల్స్‌కు వెళ్లడం, కప్పు గెలవడం అనేవి పట్టించుకోరు. అలా మాపై ఒత్తిడి ఉండదు. నేనెప్పుడూ ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా చాలా ప్రశాంతంగా ఉంటా. నాతో పాటు కోచ్, సిబ్బంది, ఇతర ఆటగాళ్లు అంతా ఇలాగే ఉంటాం. ఆత్మవిశ్వాసంతోనే మేం బరిలోకి దిగుతాం. అలాగే మా యాజమాన్యం నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది. మాకు వెన్నంటే ఉంటూ అవసరమైన విధంగా సహకరిస్తారు. మేమంతా ఒక కుటుంబంలా ఉంటాం. మాపై వారి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అని డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.

జోరు కొనసాగిస్తే:
ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే అనిపించినా.. చివరి మూడు మ్యాచ్‌ల్లో చక్కటి విజయాలతో ముందంజ వేసిన వార్నర్ సేన.. ఎలిమినేటర్‌లో బెంగళూరును ఇంటిదారి పట్టించింది. ఇదే జోరు కొనసాగిస్తే.. ఢిల్లీని ఓడించడం పెద్ద కష్టమేం కాదు. బ్యాటింగ్‌లో వార్నర్, విలియమ్సన్, హోల్డర్.. బౌలింగ్‌లో రషీద్, సందీప్, నటరాజన్ కీలకం కానున్నారు. బెయిర్‌స్టోను పక్కనపెట్టి హోల్డర్‌ను తీసుకోవడంతో జట్టులో సమతూకం వచ్చింది.

హైదరాబాద్‌దే పైచేయి:
ఈ సీజన్‌లో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్‌దే పైచేయి అయింది. రెండు సార్లూ మొదట బ్యాటింగ్ చేసిన రైజర్స్.. తొలిసారి బౌలింగ్ బలంతో, రెండోసారి బ్యాటింగ్‌తో గెలిచింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ బౌలర్లు 17 వికెట్లు పడగొడితే.. ఢిల్లీ బౌలర్లు 6 వికెట్లే తీశారు. రైజర్స్ బౌలర్లలో రషీద్ ఒక్కడే 6 వికెట్లు పడ గొట్టడం కొసమెరుపు.


Click it and Unblock the Notifications

గౌతమ్ గంభీర్‌కు కరోనా నెగెటివ్!!










