Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గౌతమ్ గంభీర్‌కు కరోనా నెగెటివ్‌!!

IPL 2020: Gautam Gambhir confirmed he has tested negative for Covid-19

ఢిల్లీ: భారత మాజీ ఓపెనర్, ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ రెండు రోజుల క్రితం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా సోకడంతో సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. అయితే తాజాగా చేసుకున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో తనకు కొవిడ్‌-19 నెగెటివ్‌గా వచ్చిందని గంభీర్ తెలిపాడు. ఈ విషయాన్ని అతడు ఆదివారం ట్విటర్‌లో వెల్లడించాడు.

'నా కొవిడ్‌ టెస్టు ఫలితం నెగెటివ్‌గా వచ్చిందని మీతో షేర్‌ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి విషెస్‌కు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సురక్షితంగా ఉండండి. ఎలాంటి అజాగ్రత్త వద్దు' అంటూ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ట్వీట్‌ చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అక్కడ నిత్యం 4-6 వేలకు పైగా కేసులు నమోదవుతన్నాయి.

లోక్‌సభ ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్.. యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్‌కు విశ్లేషణ ప్యానెల్స్‌లో భాగంగా బిజీగా ఉన్నారు. తాజాగా విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా 2012, 2014లో ట్రోఫీ అందించాడు గౌతీ. 154 ఐపీఎల్ మ్యాచులలో గంభీర్ 4217 రన్స్ చేశాడు. ఇందులో 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 93.

2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డేప్రపంచకప్ టీమిండియా గెలిచిన జట్టులో బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సభ్యుడు. అంతేకాదు రెండు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో గంభీర్ 58 టెస్టుల్లో, 147 వన్డేల్లో, 37 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 20 సెంచరీలు చేశాడు.

Story first published: Sunday, November 8, 2020, 16:56 [IST]
Other articles published on Nov 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+