CSK vs RR: ధోనీని నమ్మి పెవిలియన్‌వైపు నడిచా.. కానీ: స్మిత్

అబుదాబి: సోమవారం షేక్ జాయెద్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ధోనీసేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 125 రన్స్ చేసింది. రవీంద్ర జడేజా (30 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) ఆదుకున్నాడు. ఛేజింగ్‌లో స్మిత్ సేన 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో జోస్ బట్లర్ (48 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకంతో అలరించాడు. అతనికి స్టీవ్ స్మిత్ (26 నాటౌట్; 2 ఫోర్లు) అండగా నిలిచాడు.

ధోనీ అప్పీల్
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎల్బీడబ్ల్యూ అంశం వార్తల్లో నిలిచింది. చెన్నై ఫాస్ట్ బౌలర్ జోస్ హేజిల్‌వుడ్ వేసిన 6వ ఓవర్ మొదటి బంతిని స్మిత్ ఫ్లిక్ చేయబోగా.. ఆ బాల్ ప్యాడ్‌కు తాకింది. దీంతో చెన్నై ఆటగాళ్లు ఔట్ అంటూ అప్పీల్ చేశారు. ముఖ్యంగా కీపర్ ఎంఎస్ ధోనీ, బౌలర్ హేజిల్‌వుడ్. అయినా అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో చెన్నై డీఆర్ఎస్ కోరడంతో.. రిప్లేలో అది ప్లంబ్ అని తేలింది. దీంతో స్మిత్ పెవిలియన్ వైపు నడవడం మొదలుపెట్టాడు. కానీ అక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు థర్డ్ అంపైర్.

ఆ విషయాన్ని పసిగట్టలేకపోయాడు
థర్డ్ అంపైర్ అల్ట్రా ఎడ్జ్‌ను పరిశీలించగా.. బంతి బ్యాట్‌ను తాకినట్టు తేలింది. దీంతో స్టీవ్ స్మిత్ నాటౌట్ అని థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని తెలిపాడు. దాంతో స్మిత్ అక్కడే ఉండిపోయాడు. ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్ ఔటిచ్చినా.. బంతి బ్యాట్‌కు తాకిందనే విషయం బ్యాట్స్‌మెన్‌కు స్పష్టంగా తెలుస్తుంది. ఆ వెంటనే డీఆర్ఎస్ కోరతారు. కానీ స్మిత్ మాత్రం బ్యాట్ అంచుకు బంతి తాకుతూ వెళ్లినా.. ఆ విషయాన్ని పసిగట్టలేకపోయాడు. నాన్‌స్ట్రకర్ ఎండ్‌లో ఉన్న జోస్ బట్లర్ కూడా ఆ విషయాన్ని గమనించలేకపోయాడు.

బంతి తాకినట్లు అనిపించలేదు
మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎల్బీడబ్ల్యూ విషయంపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. 'బ్యాట్ అంచుకు బంతి తాకినట్లు నాకు అస్సలు అనిపించలేదు. ఎంఎస్ ధోనీ, జోస్ హేజిల్‌వుడ్ అప్పీల్ చేయడంతో ఔట్ అని నమ్మాను. రిప్లేలో మొదటగా అల్ట్రా ఎడ్జ్ పరీశీలించకపోవడంతో.. రెండగులు పెవిలియన్ వైపు వేశా. ఆపై అల్ట్రా ఎడ్జ్ చూశా' అని స్మిత్ తెలిపాడు. మహీ రివ్యూ తీసుకున్న సమయానికి స్మిత్ ఇంకా ఖాతా తెరవలేదు. ఒకవేళ స్మిత్ ఔటై ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది.

28 పరుగులకే మూడు వికెట్లు
స్వల్ప లక్ష్య చేధనలో రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ధాటిగా ఆడిన బెన్ స్టోక్స్ (19; 3 ఫోర్లు) మూడో ఓవర్ చివరి బంతికి ఔట్ కాగా.. రాబిన్ ఊతప్ప (4), సంజు శాంసన్ (0) నిరాశపరిచారు. దీంతో రాజస్థాన్ 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్మిత్ ఎల్బీడబ్ల్యూ నుంచి బయటపడ్డాడు. ఆపై 26 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
IPL 2020 Playoffs: ఒక్క బెర్త్ కోసం ఐదు జట్ల మధ్య పోటీ.. సన్‌రైజర్స్‌కు అవకాశాలు ఎలా ఉన్నాయంటే?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications