For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RR: ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి ఆటగాడిగా రికార్డు!!

IPL 2020, CSK vs RR: MS Dhoni creates history, 1st player to appear in 200 IPL matches
IPL 2020 : Ms Dhoni Creates History, First Player To Appear In 200 IPL Matches | Oneindia Telugu

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డుల్లోకి ఎక్కాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో ధోనీ ఈ అరుదైన ఘనత సాధించాడు. చెన్నై ఫ్రాంఛైజీ తరఫున 170 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన ధోనీ.. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు (2016, 2017సీజన్లలో) తరఫున 30 మ్యాచ్‌లు ఆడాడు.

ధోనీ @200:

ధోనీ @200:

ఐపీఎల్‌ మొదటి సీజన్ 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఆడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. 2016, 2017లో మాత్రం రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. ఫిక్సింగ్ కారణంగా చెన్నై జట్టుపై రెండేళ్లు నిషేధం పడటంతో.. ఆ రెండు సీజన్లు పుణెకి ఆడాడు. ఆ తర్వాత మళ్లీ 2018 నుంచి ధోనీ చెన్నైకి ఆడుతున్నాడు. లీగ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (197) ఉన్నాడు. ఈ సీజన్‌లోనే రోహిత్ కూడా 200 మ్యాచ్‌ల మార్క్‌ని అందుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత సురేశ్ రైనా (193), దినేశ్‌ కార్తీక్ (191), విరాట్ కోహ్లీ (186) వరుసగా ఉన్నారు.

చెన్నై తరఫున 4000 వేల పరుగులు:

చెన్నై తరఫున 4000 వేల పరుగులు:

మొత్తంగా ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ (రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచుకు ముందు వరకు) 199 మ్యాచ్‌లాడిన ఎంఎస్ ధోనీ 4,568 పరుగులు చేశాడు. ఇందులో చెన్నై తరఫున 3,994 రన్స్.. రైజింగ్ పుణె తరఫున 574 పరుగులు చేశాడు. ధోనీ కెప్టెన్సీలో 169 మ్యాచ్‌లాడిన చెన్నై ఏకంగా 102 మ్యాచ్‌ల్లో విజయం సాధించడం గమనార్హం. మరోవైపు ఇప్పటికీ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డ్‌లో ధోనీ నెం.1 స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇక ఒక ఔట్‌ చేస్తే.. 150 ఔట్లలలో భాగం అవుతాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా చెన్నై తరపున 4000 వేల పరుగులు చేసిన ఆటగాడిగా కూడా మహీ మరో రికార్డు నెలకొల్పాడు.

చెన్నైకి మూడు టైటిళ్లు:

చెన్నైకి మూడు టైటిళ్లు:

సారథిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎంఎస్ మూడు టైటిళ్లు సాధించాడు. అంతేగాక ప్రతి సీజన్‌లోనూ ప్లేఆఫ్‌కు చేర్చాడు. అయితే ఈసారి మాత్రం అతడు అంచనాలను అందుకోలేకపోతున్నాడు. తాజా సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన చెన్నై ఆరింట్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఆ జట్టు ప్లేఆఫ్‌కి చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంది.ఒక్క మ్యాచ్ ఓడినా.. దాదాపు ఇంటికి పయనమవ్వాల్సి ఉంటుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప చెన్నై ప్లేఆఫ్‌కి చేరదు.

MI vs KXIP: రెండో సూపర్‌ ఓవర్‌ ముందు గేల్‌కు కోపమొచ్చింది.. కారణం ఎవరో తెలుసా?

Story first published: Monday, October 19, 2020, 21:15 [IST]
Other articles published on Oct 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+