
వణికించిన చహర్:
126 పరుగుల ఛేదన కోసం బరిలో దిగిన రాజస్థాన్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. చెన్నై పేసర్లు దీపక్ చహర్, జోష్ హేజిల్‌వుడ్ ఇద్దరూ రాయల్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ను వణికించారు. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ బెన్ స్టోక్స్ (19; 11 బంతుల్లో, 3×4)ను దీపక్ చహర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. కొద్దిసేపటికే మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప (4)ను హేజిల్‌వుడ్ ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లో కేరళ యువ ఆటగాడు సంజు శాంసన్ (0)ని చహర్ పెవిలియన్ చేర్చాడు. కీపర్ ఎంఎస్ ధోనీ అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ అందుకోవడంతో శాంసన్ వెనుదిరిగాడు. దీంతో రాజస్థాన్ 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

37 బంతుల్లో బట్లర్ అర్ధశతకం:
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడి మరొక వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. అయితే స్మిత్ నిదానంగా ఆడగా.. బట్లర్ దూకుడుగా ఆడుతూ పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ సాగే కొద్ది బట్లర్ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో బట్లర్ 37 బంతుల్లో అర్ధశతకం నమోదు చేశాడు. అనంతరం స్మిత్ కూడా గేర్ మార్చి వేగంగా పరుగులు చేశాడు. ఈ ఇద్దరి జోరుతో రాజస్థాన్ 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి చేరి ప్లేఆఫ్‌కు అవకాశాలు మెరుగుపర్చుకుంది. మరోవైపు చెన్నై ఈ ఓటమితో ఆఖరి స్థానంలో నిలిచి తమ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.

చెన్నై టాప్ ఆర్డర్ విఫలం:
అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో శామ్ కరన్ (22: 25 బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్), ఫాఫ్ డుప్లెసిస్ (10: 9 బంతుల్లో 1x4) చెన్నై ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. మూడో ఓవర్‌లోనే చెన్నై వికెట్ చేజార్చుకోగా.. అనంతరం వచ్చిన షేన్ వాట్సన్ (8) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఆదుకుంటాడనుకున్న తెలుగు తేజం అంబటి రాయుడు (13) నిరాశపరిచారు. ఆపై కరన్ కూడా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇక రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 56/4తో నిలిచింది.

జడేజా బ్యాట్ ఝళిపించడంతో:
రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐదో వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ ధోనీ.. రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. ఇక ఆఖర్లో కేదార్ జాదవ్ (4 నాటౌట్: 7 బంతుల్లో) దూకుడుగా ఆడలేకపోయాడు. అయితే జడేజా కాస్త బ్యాట్ ఝళిపించడంతో చెన్నై 125 పరుగులు చేయగలిగింది. ఈ సీజన్లో ఇదే అత్యల్ప స్కోర్.
బుర్రను ఉపయోగిస్తే.. వయసుతో సంబంధం లేదు!! ధోనీకి మియాందాద్ సలహాలు!


Click it and Unblock the Notifications
