అనుష్క ఫ్లైయింగ్ కిస్
చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అనంతరం పెవిలియన్ ఎండ్‌కు చేరుకుంటున్న విరాట్‌ను చూసి అనుష్క తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. 'ఫ్లైయింగ్ కిస్' ఇచ్చారు. రాయల్ బ్లూ డ్రెస్‌లో నవ్వుతూ.. చప్పట్లు కొడుతూ.. ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చారు. ఇంకేముంది సోషల్ మీడియాలో ఈ ఫొటో తెగ హల్‌చెల్ చేస్తోంది. విరాట్ ఇన్నింగ్స్ కంటే ఎక్కువగా అనుష్క ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన సన్నివేశమే చర్చనీయాంశంగా మారింది.
కోహ్లీకి మద్దతు
ఐపీఎల్ 2020 ఆరంభంలో విరాట్ కోహ్లీ వరుస మ్యాచులలో విఫలమయ్యాడు. దీంతో అతడి ఆటతీరుపై అనేక విమర్శలు వచ్చాయి. ఇందుకు కారణం అనుష్క శర్మ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు కొందరు. కోహ్లీ ఈ ఇన్నింగ్స్‌తో వారందరికి సరైన సమాధానం ఇచ్చాడు. ఎవరి వల్ల అయితే అతడు విమర్శలు ఎదుర్కున్నాడో వారి ముందే అద్భుతంగా ఆడడం సంతోషంగా ఉందని నెటిజన్లు కోహ్లీకి మద్దతు తెలుపుతున్నారు. ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

'జూనియర్ కోహ్లీ తండ్రి ఆటను చూశాడు:
'కంగాట్స్ అనుష్క శర్మ. ఈ రోజు క్రెడిట్ మొత్తం మీదే. మీ వల్లే విరాట్ కోహ్లీ ఈరోజు బాగా ఆడాడు. అనుష్క వలెనే కింగ్ కోహ్లీ విఫలమైనప్పుడు.. తను బాగా ఆడినప్పుడు కారణం కూడా ఆమెనే' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'జూనియర్ విరాట్ కోహ్లీ తొలిసారిగా అనుష్క శర్మతో పాటు తన తండ్రి ఆటను చూశాడు' అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. అనుష్క ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. ఐపీఎల్ లోసం ఆమె కోహ్లీతో పాటు యూఏఈలో ఉన్న విషయం తెలిసిందే.

గవాస్కర్ అనుచిత వ్యాఖ్యలు
ఐపీఎల్ 2020 ఆరంభంలో విరాట్ కోహ్లీ పేలవ ఆటతీరుపై కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. 'ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే.. అంత బాగా మెరుగవుతానని కోహ్లీకి తెలుసు. లాక్‌డౌన్ ఉండటంతో అనుష్క బౌలింగ్‌లో మాత్రమే కోహ్లీ సాధన చేశాడు. అలా చేయడం అతనికి ఉపయోగపడలేదని తెలుస్తోంది' అని అన్నాడు. దీంతో నొచ్చుకున్న అనుష్క ఘాటుగా బదులిచ్చారు. ఆపై సన్నీ వివరణ ఇచ్చారు.
CSK vs RCB: ఎంఎస్ ధోనీ ఖాతాలో మరో రికార్డు.. మహీ కంటే ముందు!!


Click it and Unblock the Notifications
