Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs MI: చేతులెత్తేసిన చెన్నై.. ముంబై ముందు స్వల్ప లక్ష్యం!

 IPL 2020, CSK vs MI: Sam Curran 52 takes CSK to 114 after Trent Boult 4-wicket haul

షార్జా: ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్నఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 115 పరుగుల స్వల్ప లక్ష్యానికే పరిమితమైంది. ట్రెంట్ బౌల్ట్(4/18), జస్ ప్రీత్ బుమ్రా(2/25), రాహుల్ చాహర్ (2/22) నిప్పులు చెరిగే బంతులకు చెన్నై బ్యాట్స్‌మెన్ చేతులెత్తేసారు. సామకరన్ (42 బంతుల్లో 4 ఫోర్, 2 సిక్స్‌లతో 52) మినహా అంతా వరుసగా పెవిలియన్‌కు కట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్‌కే 9 వికెట్ల నష్టానికి 114 రన్స్ చేసింది. అతని హాఫ్ సెంచరీ పోరాటంతోనే ధోనీసేన కనీసం 100 పరుగుల మార్క్‌ను ధాటగలిగింది. ముంబై బౌలర్లలో బౌల్ట్, బుమ్రా, చాహర్‌కు తోడు కౌల్టర్ నీల్‌కు ఓ వికెట్ దక్కింది.

3 ఓవర్లు.. 4 వికెట్లు..

3 ఓవర్లు.. 4 వికెట్లు..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. బౌల్డ్-బుమ్రా ద్వయం అద్భుత బౌలింగ్‌కు ధోనీసేన 3 ఓవర్లలో 3 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్(0) ఏల్బీగా ఔటవ్వడంతో పరుగుల ఖాతా తెరవకుండానే చెన్నై వికెట్ల పతనం మొదలైంది. ఇక జస్‌ప్రీత్ బుమ్రా వేసిన రెండో ఓవర్‌లో వరుస బంతుల్లో అంబటి రాయుడు(2), ఎన్ జగదీషన్(0) పెవిలియన్ చేరారు. రాయుడు కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగగా.. జగదీషన్ స్లిప్‌లో సూర్యకుమార్ యాదవ్ సూపర్ క్యాచ్‌కు ఔట్ అయ్యాడు. బౌల్ట్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే ఫాఫ్ డూప్లెసిస్(1) కూడా కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో చెన్నై 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

 ప్చ్ ధోనీ మళ్లీ విఫలం..

ప్చ్ ధోనీ మళ్లీ విఫలం..

ఈ క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన ధోనీ, జడేజా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో ధోనీ(16 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్‌తో 16) రెండు ఫోర్లు కొట్టగా.. జడేజా(7) కూడా ఓ ఫోర్ కొట్టాడు. దాంతో ఈ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. ఆ మరుసటి ఓవర్‌ను కృనాల్ కట్టుదిట్టంగా వేయగా.. బౌల్ట్ వేసిన 6వ ఓవర్‌లో జడేజా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం రాహుల్ వేసిన ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టిన ధోనీ ఆ మరుసటి బంతికే మరో షాట్‌కు ప్రయత్నించి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో చెన్నై కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. క్రీజులోకి వచ్చిన సామ్ కరన్ సిక్సర్లతో ఆకట్టుకున్నా.. దీపక్ చాహర్ తమ్ముడు రాహుల్ చాహర్ బౌలింగ్‌లో డకౌట్ అవ్వడంతో చెన్నై 43 పరగులకే 7 వికెట్లు కోల్పోయింది.

 సామ్ కరన్ సూపర్ ఫిఫ్టీ..

సామ్ కరన్ సూపర్ ఫిఫ్టీ..

ఈ స్థితిలో శార్దల్ ఠాకుర్(11)సాయంతో సామ్ కరన్ బాధ్యతాయుతంగా ఆడాడు. వీలుచిక్కిన బంతులను బౌండరీలకు తరలించాడు. అయితే కౌల్డర్ నీల్ బౌలింగ్‌లో శార్ధుల్ ఠాకుర్ ఔటవ్వడంతో 8వ వికెట్‌కు నమోదైన 28 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివర్లో తాహిర్ సాయంతో సామ్ కరన్ జట్టు స్కోర్‌ను 100 పరుగులు ధాటించాడు. బౌల్ట్ వేసిన చివరి ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టిన కరన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి బంతికి కరన్ క్లీన్ బౌల్ట్ కావడంతో చెన్నై 114 పరుగులకే ముగిసింది.

Story first published: Friday, October 23, 2020, 21:36 [IST]
Other articles published on Oct 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+