
చావో రేవో
ప్లేఆఫ్ రసవత్తరంగా ఉండటంతో రాహుల్ టీమ్‌కు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. ఎందుకంటే.. ఇప్పటికే నాలుగో స్థానంలో కొనసాగుతున్న హైదరాబాద్ మెరుగైన రన్‌రేట్‌తో పోరాడుతోంది. ఇప్పుడు 12 పాయింట్లతో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ రేసులో నిలవాలని పంజాబ్ భావిస్తోంది. కేఎల్ రాహుల్, మన్‌దీప్ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్ రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. మ్యాక్సీ ఫామ్ అందుకోవాల్సి ఉంది. షమీ, జోర్డాన్ కూడా సత్తాచాటిలి. సమిష్టిగా రాణిస్తే పంజాబ్ విజయం అందుకోగలదు.

మంచి ఊపులో చెన్నై
బెంగళూరు, కోల్‌కతాలపై ఘన విజయాలు సాధించిన చెన్నై మంచి ఊపులో ఉంది. చెన్నై ప్లేఆఫ్స్ రేసులో లేకున్నా ఘన విజయంతోనే ఈ సీజన్‌కు ముగింపు పలకాలని భావిస్తోంది. దీంతో ఎలాంటి ఒత్తిడిలేకుండా ఆడనుంది. రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, సామ్ కరన్ రాణిస్తున్నారు. మరోసారి వీరు చెలరేగితే చెన్నైకి విజయం ఖాయమే. అయితే ధోనీసేనకు బౌలింగ్ ఇబ్బందికరంగా మారింది. వికెట్ టేకర్ బౌలర్ లేరు. ఇది రాహుల్ టీమ్‌కు కలిసొచ్చే విషయం.

మెరుగైన రన్‌రేట్ సాధించాలి:
ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిచినా చెన్నైపై మెరుగైన రన్‌రేట్ సాధించాలి. లేదంటే ఇప్పటికే హైదరాబాద్ దానికన్నా ముందుంది. అలాగే ప్రస్తుతం రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్న బెంగళూరు, ఢిల్లీ జట్లతోనూ రన్‌రేట్ విషయంలో పోటీపడాల్సి ఉంటుంది. కాబట్టి రాహుల్ టీమ్ కచ్చితంగా అద్భుతమైన విజయం సాధించాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

జట్లు అంచనా
పంజాబ్: కేఎల్ రాహుల్, మన్‌దీప్ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్ వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, ఎన్ జగదీషన్, సామ్ కరన్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, లుంగీ ఎంగిడి.


Click it and Unblock the Notifications

DC vs MI: డికాక్ కామెడీ రనౌట్.. బంతిని కాలితో తన్నబోయి!!










