For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs KKR: జడేజా మెరుపులు.. రుతురాజ్‌ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై చెన్నై విక్టరీ!!

IPL 2020, CSK vs KKR: Ravindra Jadeja hits 2 sixes off last 2 balls to win Chennai a thriller vs KKR

దుబాయ్‌: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుత విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనను చివరి బంతికి ఛేదించింది. చివరి ఓవర్లో చెన్నైకి 10 పరుగులు అవసరం కాగా... క్రీజులో ఉన్న సర్ రవీంద్ర జడేజా ఆఖరి రెండు బంతులకు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీ20 లీగ్‌లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను అలరించింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్ ‌(72: 53 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధ శతకంతో రాణించగా.. అంబటి రాయుడు (38: 20బంతుల్లో 5ఫోర్లు, సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. జడేజా (31 నాటౌట్:‌ 11 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌ ఓటమితో కోల్‌కతా ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే.

గైక్వాడ్‌ హాఫ్ సెంచరీ:

గైక్వాడ్‌ హాఫ్ సెంచరీ:

173 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన చెన్నైకి ఓపెనర్లు షేన్ వాట్సన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరు కలిసి కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 50 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నాక వాట్సన్‌ (14; 19బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌) పరుగుల వద్ద ఔటయ్యాడు. వాట్సన్‌ కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రింకూ చేతికి చిక్కి ఔటయ్యాడు. గైక్వాడ్‌కు జతకలిసిన అంబటి రాయుడు ఎడాపెడా బౌండరీలు బాదాడు. 10వ ఓవర్‌ వేసిన రాణా బౌలింగ్‌లో రాయుడు హ్యాట్రిక్‌ బౌండరీలు బాదాడు. తర్వాత ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో యువ బ్యాట్స్‌మన్‌ గైక్వాడ్‌ ఫోర్‌.. సిక్సర్‌ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

జడ్డూ రెండు భారీ సిక్సర్లు:

జడ్డూ రెండు భారీ సిక్సర్లు:

దూకుడుగా ఆడుతున్న రాయుడు.. కమిన్స్‌ బౌలింగ్‌లో నరైన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చి కెప్టెన్ ఎంఎస్ ధోనీని చక్రవర్తి బోల్తా కొట్టించాడు. బంతిని సరిగా అంచనావేయలేకపోయిన ధోనీ 1(4) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. చెన్నై విజయానికి 15 బంతుల్లో 33 పరుగులు అవసరమైన సమయంలో గైక్వాడ్‌ కూడా ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలోనే మ్యాచ్‌ చెన్నై వైపు తిరిగింది. ఫెర్గుసన్‌ వేసిన 19వ ఓవర్లో జడేజా ఫోర్‌, రెండు సిక్సర్లు బాది 20 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం కాగా చివరి రెండు బంతుల్లో రెండు భారీ సిక్సర్లు కొట్టి చెన్నైకి అద్భుత విజయాన్నందించాడు. స్పీడ్‌స్టర్‌ పాట్‌ కమిన్స్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

మెరిసిన నితీశ్‌ రాణా:

మెరిసిన నితీశ్‌ రాణా:

అంతకుముందు ఓపెనర్‌ నితీశ్‌ రాణా (87: 61 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత అర్ధ శతకంతో మెరవడంతో కోల్‌కతా నైట్‌ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఆరంభంలో మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ ‌(26: 17 బంతుల్లో 4ఫోర్లు), చివరలో దినేశ్‌ కార్తీక్‌ (21 నాటౌట్:‌ 10 బంతుల్లో 3ఫోర్లు) విజృంభించడంతో కోల్‌కతా పటిష్ఠస్థితిలో నిలిచింది. అయితే కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ (15) దూకుడుగా ఆడలేకపోయాడు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా.. సాంట్నర్‌, జడేజా, కర్ణ్‌ శర్మ చెరో వికెట్‌ పడగొట్టారు.

'నేను సెంచరీ చేసిన సిరీస్‌లో మీరు కోచ్‌గా ఉండాల్సింది.. నా అంతర్జాతీయ కెరీర్‌కు దోహదపడేది'

Story first published: Thursday, October 29, 2020, 23:40 [IST]
Other articles published on Oct 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+