For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RCB: సురేష్ రైనా.. ప్లీజ్ తిరిగి వచ్చేయ్!!.. కష్టాల్లో ఉన్న చెన్నైని ఆదుకో!!

IPL 2020: CSK fans want Suresh Raina to make a comeback as the team continues to struggle in IPL 2020
#ComeBackMrIPL : Fans Want Suresh Raina's Comeback to CSK, The Only Hope | IPL 2020 || Oneindia

హైదరాబాద్: ఎన్నో అంచనాల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఊహించని విధంగా విఫలమవుతుంది. కెప్టెన్ ఎంఎస్ ధోనీ జట్టులో మార్పులు చేసినా.. వ్యూహాలు మార్చినా సీఎస్‌కేకి ఓటమి తప్పడం లేదు. బౌలింగ్ విభాగంలో కాస్త పర్వాలేదనిపిస్తున్నా.. చెత్త బ్యాటింగ్‌తో కనీస పోటీ ఇవ్వకుండా చేతులెత్తేస్తుంది. జట్టులో ఎంతో అనుభవమున్న అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నా కూడా విజయాలు మాత్రం వరించడం లేదు. ఇప్పటికే ఏడు మ్యాచ్‌లాడిన సీఎస్‌కే కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. దీంతో ప్లేఆఫ్ అవకాశాలు సన్నగిల్లాయి.

ప్లీజ్ తిరిగి వచ్చేయ్

ప్లీజ్ తిరిగి వచ్చేయ్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. లీగ్ దశలో మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో కనీసం ఆరు విజయాలు అందుకోవాల్సి ఉంది. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే బ్యాటింగ్ ప్రదర్శన చూస్తే.. మళ్లీ పుంజుకోవడం (ఆరు విజయాలు సాధించడం) కష్టమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న సీఎస్‌కేను ఆదుకోవాలని సురేశ్ రైనాను అభిమానులు కోరుతున్నారు. భారత్ నుంచి ఉన్నపళంగా రైనా యూఏఈ రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కామ్ బ్యాక్ మిస్టర్ ఐపీఎల్

కామ్ బ్యాక్ మిస్టర్ ఐపీఎల్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సురేష్ రైనా ఆదుకోవాలని సోషల్ మీడియాలో అభిమానులు కోరుతున్నారు. 'ఎవరైనా మళ్లీ సురేష్ రైనాను ఐపీఎల్ 2020కి తీసుకురండి' ఓ చెన్నై అభిమాని ట్వీట్ చేయగా.. 'కామ్ బ్యాక్ మిస్టర్ ఐపీఎల్.. లవ్ యూ రైనా భాయ్.. మీ ఆటను చాలా మిస్ అవుతున్నాం. ప్లీజ్ యూఏఈ రండి' అని మరో అభిమాని ట్వీటాడు. 'రైనా దయచేసి తిరిగి రండి. చెన్నైకి నా జీవితాంతం రుణపడి ఉంటాను. మేము మిమ్మల్ని ఎన్నిసార్లు అయినా వేడుకోగలం! దయచేసి తిరిగి రండి రైనా' అని ఫాన్స్ వేడుకుంటున్నారు. చెన్నై అభిమానులంతా #ComeBackMrIPL యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

వెబ్‌సైట్ నుంచి తొలగింపు

వెబ్‌సైట్ నుంచి తొలగింపు

ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టు సభ్యులతో పాటు దుబాయ్ వెళ్లిన మిస్టర్ ఐపీఎల్‌ సురేష్ రైనా.. వారం రోజులు తిరగకముందే స్వదేశానికి వచ్చేశాడు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో రైనా మేనత్త కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురైన విషయం తెలుసుకుని స్వదేశానికి తిరిగొచ్చాడు. తన మేనత్త కుటుంబంపై దాడికి పాల్పడిన నిందితులను పట్టుకోవాలని పంజాబ్ సీఎంను రైనా కోరాడు. రైనా ప్రత్యేకంగా కోరడంతో సీఎం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేసి నిందులను పట్టుకున్నారు. దీంతో రైనా మళ్లీ ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళుతాడు అనే వార్తలు వచ్చాయి. అయితే రైనా పేరును చెన్నై తమ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. దీంతో ఈ సీజన్లో రైనా జట్టులోకి తిరిగి రావడం లేదని చెన్నై జట్టు తేల్చేసింది. అయితే అభిమానులు మాత్రం మళ్లీ రావాలని కోరుతున్నారు.

ఐపీఎల్‌లో 5,368 పరుగులు

ఐపీఎల్‌లో 193 మ్యాచ్‌లాడిన సురేశ్ రైనా 137.11 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 5,368 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చెన్నై టీమ్‌లో ఈ రికార్డ్‌లు ఏ బ్యాట్స్‌మెన్‌కి లేవు. రైనా స్థానంలో ఆడుతున్న అంబటి రాయుడు ఒక మ్యాచ్‌లో మినహా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ తేలిపోయాడు. కీలక మూడో స్థానంలో సరైన ఆటగాడు లేక చెన్నై సతమతమవుతోంది. గత ఆగస్టు 15న రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన రైనా.. 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

CSK vs RCB: అనుష్క శర్మ ఫ్లైయింగ్‌ కిస్‌.. ఫాన్స్ ఏమంటున్నారంటే?

Story first published: Sunday, October 11, 2020, 16:29 [IST]
Other articles published on Oct 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+