IPL 2020: పేపర్‌పై చెన్నై అభిమానులు ప్లే ఆఫ్ లెక్కలు.. టేబుల్ టాపర్ ధోనీ సేననే!

హైదరాబాద్: పది సీజన్లు.. మూడుసార్లు విజేత.. ఐదుసార్లు రన్నరప్.. ఓసారి సెమీస్... మరోసారి ప్లే ఆఫ్స్.. ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ జైత్రయాత్ర ఇది..! స్పాట్ ఫిక్సింగ్ మకిలి అంటుకున్నా... రెండేళ్లు లీగ్‌కు దూరంగా ఉన్నా... ఆట పరంగా మాత్రం సీఎస్‌కే స్థాయి ఎవరెస్ట్ ..! మిగతా ఫ్రాంచైజీల మాదిరిగా వరల్డ్ క్లాస్ సూపర్ స్టార్లు లేకపోయినా.. స్కిల్డ్ ప్లేయర్లు లభించక పోయినా.. యంగ్ గన్స్ అండ దొరకకపోయినా... కేవలం ఇద్దరు, ముగ్గురు ప్లేయర్ల ఎక్స్పీరియెన్స్తోనే టైటిల్స్‌ను కొల్లగొట్టడం చెన్నై స్పెషాలిటీ..! మరీ ముఖ్యంగా కూల్ కెప్టెన్ మహేంద్రుడి మాయాజాలం.. చెన్నైకి అన్నిటికంటే పెద్ద మహిమ..! ఇంతటి ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న చెన్నై ఐపీఎల్ 2020 సీజన్‌లో తేలిపోతుంది.
ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 ఓడి ఊహించని విధంగా ఏడో స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితుల్లో ఆ జట్టు ప్లే ఆఫ్ చేరడం కష్టమే. కానీ అభిమానులు మాత్రం ధోనీపై నమ్మకంతో ఉన్నారు. మహేంద్రుడు తన మాయాజాలంతో అద్భుతం చేస్తాడని ఆశిస్తున్నాడు. అంచనాలను అందుకుంటూ డాడీస్ ఆర్మీ ప్లే ఆఫ్ చేరుతుందని లెక్కలు కడుతున్నారు.

ఇలా జరిగితే టేబుల్ టాపర్ ధోనీనే..
లీగ్‌లో ధోనీ సేన ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నేడు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో సహా మిగిలిన నాలుగు మ్యాచ్‌లు నెగ్గితే చెన్నై ప్లే ఆఫ్ చేరుకుంటుందని చెన్నై ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. ఇతర మ్యాచ్‌ల్లో కూడా తాము అంచాన వేసే జట్లు గెలిస్తే సీఎస్‌కే టేబుల్ టాపర్‌గా నిలవడంలో ఎలాంటి సందేహం ఉండదంటున్నారు.

ప్లే ఆఫ్
KXIP vs DCలో పంజాబ్, KKR vs RCBలో కోల్‌కతా, RR vs SRHలో హైదరాబాద్, KKR vs DCలో కోల్‌కతా, KXIP vs SRHలో హైదరాబాద్, RR vs MIలో రాజస్థాన్, KKR vs KXIPలో పంజాబ్, SRH vs DCలో హైదరాబాద్, MI vs RCBలో బెంగళూరు, KXIP vs RRలో పంజాబ్, DC vs MIలో ఢిల్లీ, RCB vs SRHలో హైదరాబాద్, KKR vs RRలో రాజస్థాన్, DC vs RCBలో బెంగళూరు, SRH vs Miలో ముంబై గెలిస్తే 16 పాయింట్లతో చెన్నై టాపర్‌గా.. డీసీ, కేకేఆర్, హైదరాబాద్ మూడు జట్లు ప్లే ఆఫ్ చేరుతాయంటున్నారు.
నాలుగో స్థానంలోనైనా..
ఇలా కాకుండా.. చెన్నై ఐదు మ్యాచ్‌లకు ఐదు గెలిచి.. ఢిల్లీ మిగతా 5 మ్యాచ్‌ల్లో మూడు గెలిచి రెండు ఓడాలని.. ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ కూడా మరో మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే నాలుగో జట్టుగా 16 పాయింట్లతో చెన్నై ప్లే ఆఫ్‌కు చేరుతుదంటున్నారు. ఇది జరగాలంటే కేకేఆర్ మిగతా 5 మ్యాచ్‌ల్లో ఒకటి కూడా గెలవద్దని, హైదరాబాద్ మూడు, పంజాబ్ ఒకటి, రాజస్థాన్ 2 మాత్రమే గెలవాలని కోరుకుంటున్నారు. ఇదే జరిగితే ఢిల్లీ, ముంబై, ఆర్‌సీబీ, చెన్నై టాప్-4గా ప్లే ఆఫ్ చేరుతాయంటున్నారు.
ఫన్నీ ట్రోల్స్..
ఇక చెన్నై అభిమానులు ప్రస్తుత పరిస్థితిపై నెట్టింట ఫన్నీ మీమ్స్, వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. గత మూడు సీజన్‌లుగా ఆర్‌సీబీ వైఫల్యం చెందగా ఆ జట్టు అభిమానులు కూడా ఇలానే బాధపడ్డారు.ఇప్పుడు చెన్నై ఫ్యాన్స్ ఆ దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే అప్పట్లో ఆర్‌సీబీ వాళ్లు కూడా ఈ రకంగానే లెక్కలు కట్టేవారు. దాంతో వారి దగ్గరకు వెళ్లి ప్రెడిక్షన్ టేబుల్ నేర్చేకోమని సెటైర్స్ వేస్తున్నారు. ఇక ఈ సీజన్‌లో ఆర్‌సీబీ పర్వాలేదనిపిస్తుంది. 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో మూడో స్థానంలో సేఫ్‌గా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications