For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: ఎంఎస్ ధోనీకి కరోనా నెగటివ్.. చెన్నైకి పయనం!!

IPL 2020: CSK Captain MS Dhoni testing negative for coronavirus

రాంచీ: చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్, టీమిండియా సీనియర్ వికెట్ కీపర్‌ ఎంఎస్ ధోనీకి నిర్వహించిన కరోనా పరీక్షలో నెగటివ్ అని తేలింది. దీంతో ఫిట్‌నెస్‌ క్యాంప్‌ కోసం ధోనీ చెన్నై బయలుదేరనున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ జరగనుంది. ఆగస్టు 20 తర్వాత అన్ని ప్రాంఛైజీలు యూఏఈకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టోర్నీ బయో బబుల్ వాతావరణంలో జరుగుతున్న విషయం తెలిసిందే.

 ధోనీకి కరోనా నెగటివ్:

ధోనీకి కరోనా నెగటివ్:

యూఏఈ‌లో జ‌రిగే ఐపీఎల్‌13 కోసం క్రికెట‌ర్లు స‌న్న‌ద్దం అవుతున్నారు. బీసీసీఐ రూల్స్ ప్రకారం చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బుధ‌వారం రాంచీలో కోవిడ్‌19 ప‌రీక్ష‌లు చేయించుకున్నాడు. గురునానక్ హాస్పిటల్‌‌కు చెందిన సిబ్బంది ఒకరు బుధ‌వారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ధోనీ ఫామ్ హౌస్‌కు వెళ్లి కోవిడ్-19 ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌కు సంబంధించిన సాంపుల్స్ కలెక్ట్ చేశారు. వాటిని టెస్టింగ్‌కు పంపించగా.. ఈ రోజు సాయంత్రం వచ్చిన రిపోర్టులో నెగటివ్ అని తేలింది. దీంతో చెన్నై ప్రాంచైజీ ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్‌ క్యాంప్‌ కోసం ధోనీ చెన్నై బయలుదేరనున్నాడు.

వారం పాటు ఫిట్‌నెస్‌ క్యాంప్‌:

వారం పాటు ఫిట్‌నెస్‌ క్యాంప్‌:

యూఏఈ వెళ్లే ముందే చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తమ ఆటగాళ్ల కోసం ఒకవారం పాటు ఫిట్‌నెస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం నుంచి సైతం అనుమతులు లభించాయని చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్‌ పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి 20 వరకు చెన్నై చెపాక్‌ స్టేడియంలో ఫిట్‌నెస్‌ క్యాంప్‌ జరగనుంది. ఈ క్యాంపుకు బౌలింగ్ కోచ్ ఎల్ బాలాజీ నేతృత్వం వ‌హిస్తాడు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తప్ప ఈ క్యాంప్‌కు ఆటగాళ్లు అందరూ హాజరవుతున్నారు. క్యాంపు అనంతరం ఆగస్టు 21న చెన్నై జట్టు దుబాయ్‌కు బయలుదేరనుంది. కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, అసిస్టెంట్‌ కోచ్‌ మైఖేల్‌ హస్సీ 22న దుబాయ్‌లో జట్టులో చేరుతారు.

8 మంది నెట్ బౌలర్లు:

8 మంది నెట్ బౌలర్లు:

ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, పీయూష్ చావ్లాతో పాటు మ‌రో 8 మంది త‌మిళ‌నాడు క్రికెటర్లు యూఏఈ వెళ్లేందుకు సెలెక్ట్ అయ్యారు. ఎంపికైన త‌మిళ బౌల‌ర్లు నెట్స్‌లో బౌలింగ్ చేస్తారు. అశ్విన్ క్రిస్ట్‌, జే కౌశిక్‌, ఎం మొహ‌మ్మ‌ద్‌, ఔశిక్ శ్రీనివాస్‌, ఎల్ విఘ్నేశ్‌, అభిషేక్ త‌న్వార్‌లు ఎంపికైన‌ వారిలో ఉన్నారు. వీరందరూ 21న చెన్నై జ‌ట్టుతో పాటు యూఏఈ వెళ్లనున్నారు.

 దుబాయ్‌కు వెళ్లేముందు రెండు సార్లు:

దుబాయ్‌కు వెళ్లేముందు రెండు సార్లు:

నిబంధనల ప్రకారం దుబాయ్‌కు వెళ్లేముందు రెండు సార్లు.. వెళ్లిన తర్వాత మొదటి రోజు, మూడో రోజు, ఆరో రోజు మరోసారి టెస్ట్‌లు చేయనున్నారు. ఈ మూడు టెస్ట్‌ల్లో నెగటీవ్ వస్తే బయోబబుల్ వాతావరణంలో మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతిస్తారు. ఇక టోర్నీ జరుగుతున్నంత కాలం ఐదు రోజులకోసారి బయోబబుల్‌లో ఉన్నందరికి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ బయోబబుల్‌లో ఆటగాళ్లంతా మాస్క్‌లు పెట్టుకోవడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరి పాటించాలి. ఒకవేళ ఎవరైనా బబుల్ రూల్స్ బ్రేక్ చేస్తే.. వాళ్లు క్వారంటైన్‌లో ఉండాల్సిందే.

'అతన్ని కలిశాక మైండ్‌ బ్లాక్‌ అయ్యింది.. 10 నిమిషాలు ఏమీ మాట్లాడలేకపోయా'

Story first published: Thursday, August 13, 2020, 18:43 [IST]
Other articles published on Aug 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+