Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: Chennai Super Kings బలాలు, బలహీనతలు..ప్లేఆఫ్స్ అంచనా!!

IPL 2020: Chennai Super Kings Team Strength, Weakness, Playoffs Chances and Prediction
IPL 2020 : Chennai Super Kings Play-offs Chances And Prediction | CSK Players | Oneindia Telugu

హైదరాబాద్: క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 ప్రారంభంకు మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. కరోనా సంక్షోభంలో సైతం అభిమానులకు మజాను అందించడానికి సన్నద్ధమైంది క్యాష్‌ రిచ్‌ లీగ్‌. టీమిండియా సభ్యులు తమ సహచరులపైనే కత్తులు దూసేందుకు ప్రతీ ఏడాదిలాగే సిద్ధమైపోయారు. ప్రస్తుతానికి లీగ్‌ దశ మ్యాచ్‌ల వరకే షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ.. ప్లే ఆఫ్స్, ఫైనల్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ను, వేదికలను తర్వాత ప్రకటించనుంది. అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) బలలాలు, బలహీనతలను తెలుసుకుందాం.

 ధోనీనే అతిపెద్ద బలం:

ధోనీనే అతిపెద్ద బలం:

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ఏదంటే ముందుగా గుర్తొచ్చేది చెన్నై సూపర్ కింగ్స్. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టుకు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. ఫిక్సింగ్ కారణంగా రెండు సీజన్ల పాటు టోర్నీకి దూరమైనప్పటికీ.. ఆ జట్టు ఇప్పటి వరకూ మూడుసార్లు విజేతగా నిలిచింది. అంతేకాదు ప్రతి సీజన్లోనూ ప్లే ఆఫ్ చేరింది. దీనికి కారణం మహీ సారథ్యమే. ధోనీ అంటే సీఎస్‌కే.. సీఎస్‌కే అంటే ధోనీలా మారింది. మహీనే ఆ జట్టుకు అతిపెద్ద బలం.

పటిష్టంగా బ్యాటింగ్ లైనప్:

పటిష్టంగా బ్యాటింగ్ లైనప్:

లీగ్ ఆరంభం నుంచే విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్ చేరడం చెన్నై అసలు రహస్యం. ఒకవేళ పరాజయాలు ఎదురైనా.. ఎంఎస్ ధోనీ తన చురుకైన సారథ్యంతో గట్టెక్కిస్తుంటాడు. జట్టును ఒత్తిడి నుండి బయటపడేసి గాడిలో పడేలా చేయడంలో మహీది సెపరేట్‌ స్టైల్‌. ఆటగాళ్లను కూడా ఎంతో కూల్‌గా ఉంచుతూ వారి నుంచి పూర్తిస్థాయి ప్రదర్శనతో ఆకట్టుకునేలా చేయడంలో ధోనీకి సాటిలేదు. ఇక షేన్‌ వాట్సన్‌, ఫాఫ్ డుప్లెసిస్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్, మురళీ విజయ్‌, ఎంఎస్ ధోనీల బ్యాటింగ్‌ బలం. ముఖ్యంగా వాట్సన్‌, డుప్లెసిస్‌, రాయుడులు ఒక్కసారి గాడిలో పడితే సీఎస్‌కే బ్యాటింగ్‌ మరింత బలోపేతం అవుతుంది.

ఆల్‌రౌండర్లు అదనపు బలం:

ఆల్‌రౌండర్లు అదనపు బలం:

డ్వేన్‌ బ్రేవో, రవీంద్ర జడేజా లాంటి స్టార్ ఆల్‌రౌండర్లు‌ ఉండటం సీఎస్‌కేకు అదనపు బలం. మిచెల్‌ సాంట్నర్, సామ్‌ కరన్‌లు కూడా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేయగలరు. బ్రేవో, జడేజాలు ఎలాంటి సమయంలోనైనా బ్యాట్ జులిపించగలరు. ఇక సాంట్నర్, కరన్‌లు కూడా చెలరేగితే చెన్నైని ఆపడం కష్టం. స్పిన్‌ విభాగంలో ఇమ్రాన్‌ తాహీర్ ప్రధానపాత్ర పోషించే అవకాశం ఉంది. పేస్‌ బౌలింగ్‌ విభాగంలో లుంగీ ఎన్‌గిడి, శార్దూల్ ఠాకూర్, దీపక్‌ చాహర్‌లే సీఎస్‌కేకు ఉన్న ప్రధాన ఆప్షన్లు.

 అతిపెద్ద బలహీనత అదే:

అతిపెద్ద బలహీనత అదే:

సీఎస్‌కే వైస్‌ కెప్టెన్‌గా ఉన్న సురేశ్‌ రైనా జట్టుకు దూరం కావడం పూడ్చలేని లోటు. ఇక స్పిన్‌ విభాగంలో హర్భజన్‌ సింగ్‌ లేకపోవడంతో అనుభవం ఉన్న ఒక స్పిన్నర్‌ సేవల్ని సీఎస్‌కే కోల్పోనుంది. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు లేకపోవడం చెన్నై అతిపెద్ద బలహీనత. వీరు లేని లోటును మహీ ఎలా పూడ్చుతాడో చూడాలి. ఇక ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హజల్‌వుడ్‌ ఉన్నా.. చోటుదక్కే అవకాశం తక్కువే. స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా ఉన్నప్పటికీ చూరగొనే ప్రదర్శన ఇప్పటివరకూ చేయలేదు. ఏదేమైనా చెన్నై అన్ని విభాగాల్లో పటిష్టంగానే ఉంది. ఎప్పట్లాగే ఈసారి చెన్నైపై భారీ అంచనాలున్నాయి. ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మహీ ఉండగా.. చెన్నైకి బెంగేలా!!.

 చెన్నై జట్టు‌:

చెన్నై జట్టు‌:

ఎంఎస్ ధోనీ, శార్దూల్ ఠాకూర్, కేఎమ్ ఆసిఫ్, దీపక్ చహర్, ఇమ్రాన్ తాహిర్, కర్న్ శర్మ, ఎన్ జగదీసన్, మోను కుమార్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, లుంగీ ఎన్‌గిడి, కేదార్ జాదవ్, డ్వేన్‌ బ్రేవో, రుతురాజ్ గ్వైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, అంబటి రాయుడు, షేన్ వాట్సన్, సామ్ కర్రన్, పియూష్ చావ్లా, జోష్ హాజిల్‌వుడ్, ఆర్ సాయి కిషోర్.

'వీరేంద్ర సెహ్వాగ్ తీసుకున్న ఆ నిర్ణయం వల్లే.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోనీ కెప్టెన్‌ అయ్యాడు'

Story first published: Saturday, September 12, 2020, 21:12 [IST]
Other articles published on Sep 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+